Khiladi wife: సౌదీ ప్రియుడితో లేడీ లీడర్ రొమాన్స్, భర్త అడ్డు ఉన్నాడని, డ్రగ్స్ కేసులో ?, సెటప్ !
కొచ్చి/ ఇడుక్కి: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో మొదట్లో చక్కగా కాపురం చేసింది. దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న భర్త బాగానే డబ్బు సంపాధించాడు. భార్య అధికార పార్టీ నాయకురాలిగా మంచి ఫామ్ లో ఉంది. దుబాయ్ లో ఉంటున్న భర్త సంవత్సరానికి ఒక్కసారి సొంతఊరికి వచ్చి వెళ్లేవాడు. రెండు సంవత్సరాల నుంచి భర్త దుబాయ్ కి వెళ్లకుండా సొంత ఊర్లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే సమయంలో సౌదీలో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్న ఓ వ్యక్తి లేడీ లీడర్ కు ఫోన్ లో పరిచయం అయ్యాడు. రానురాను సౌదీ బాయ్ ఫ్రెండ్ లేడీ లీడర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య, పిల్లలను సౌదీలో వదిలేసి వచ్చిన ప్రియుడు లేడీ లీడర్ తో కొన్ని నెలల పాటు ఎంజాయ్ చేశాడు. భర్తను గాలికి వదిలేసి సౌదీ ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి లేడీ లీడర్ సిద్దం అయ్యింది. సౌదీలో ఉంటున్న భార్య, పిల్లలను వదిలేసి లేడీ లీడర్ ను పెళ్లి చేసుకోవాలని సౌదీ ప్రియుడు డిసైడ్ అయ్యాడు. అయితే మద్యలో లేడీ లీడర్ అడ్డుగా ఉండటంతో లేడీ లీడర్, ఆమె ప్రియుడు అనేక స్కెచ్ లు వేశారు. భర్తను చంపేస్తే జైలుపాలు అవుతామని, మనం ఎంజాయ్ చెయ్యలేమని లేడీ లీడర్ ప్రియుడికి చెప్పింది. భర్తను కొన్ని సంవత్సరాల పాటు జైల్లో పెడితే మన కోరికలు తీరుతాయని, మనకు ఎవ్వరూ అడ్డుకూడా ఉండరని లేడీ లీడర్ ఆమె ప్రియుడికి చెప్పింది. అనుకున్నట్లే లేడీ లీడర్ క్రిమినల్ మైండ్ ఉపయోగించి ఆమె భర్త ఓ పవర్ ఫుల్ కేసులో పోలీసులకు చిక్కిపోయేట్లు చేసింది.

మొదట్లో భార్యతో హ్యాపీగా ఉండేది
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వందన్మేడులో సౌమ్యా సునీల్ అలియాస్ సౌమ్యా (34) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఇడుక్కి జిల్లాలోనే సునీల్ వర్గీస్ అలియాస్ సునీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న సౌమ్యా ఆమె భర్త సునీల్ తో మొదట్లో చక్కగా కాపురం చేసింది.

అధికార పార్టీ లేడీ లీడర్
దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న సునీల్ బాగానే డబ్బు సంపాధించాడు. సునీల్ భార్య సౌమ్యా సీపీఐ(ఎం) నాయకురాలిగా మంచి ఫామ్ లో ఉంది. దుబాయ్ లో ఉంటున్న సౌమ్యా భర్త సునీల్ రెండు సంవత్సరాల క్రితం వరకు సంవత్సరానికి ఒక్కసారి సొంతఊరికి వచ్చి వెళ్లేవాడు. రెండు సంవత్సరాల నుంచి సునీల్ దుబాయ్ కి వెళ్లకుండా సొంత ఊర్లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు.

లేడీ లీడర్ కు టచ్ లోకి వచ్చిన దుబాయ్ ప్రియుడు
కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వినోద్ అనే వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి సౌదీలో ఉంటున్నాడు. లేడీ లీడర్ సౌమ్యాకు గత ఏడాదిలో వినోద్ ఫోన్ లో పరిచయం అయ్యాడు. రానురాను సౌదీలో ఉంటున్న వినోద్ లేడీ లీడర్ సౌమ్యాకు దగ్గర అవుతూ వచ్చాడు. సౌదీ బాయ్ ఫ్రెండ్ వినోద్ కేరళకు వచ్చి వెలుతూ లేడీ లీడర్ సౌమ్యాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

లేడీ లీడర్ కిలాడీ స్కెచ్
భార్య, పిల్లలను సౌదీలో వదిలేసి వచ్చిన ప్రియుడు వినోద్ లేడీ లీడర్ సౌమ్యాతో కొన్ని నెలల పాటు ఎంజాయ్ చేశాడు. భర్త సునీల్ ను గాలికి వదిలేసి సౌదీ ప్రియుడు వినోద్ ను పెళ్లి చేసుకోవడానికి లేడీ లీడర్ సౌమ్యా సిద్దం అయ్యింది. సౌదీలో ఉంటున్న భార్య, పిల్లలను వదిలేసి లేడీ లీడర్ సౌమ్యాను పెళ్లి చేసుకోవాలని సౌదీ ప్రియుడు వినోద్ కూడా డిసైడ్ అయ్యాడు.

భర్తను చంపేస్తే జైలుకు పోతాము.... బయట ఉండాలంటే ?
మద్యలో లేడీ లీడర్ సౌమ్యా భర్త అడ్డుగా ఉండటంతో లేడీ లీడర్, ఆమె ప్రియుడువినోద్ కలిసి సునీల్ అడ్డు తొలగించుకోవడానికి అనేక స్కెచ్ లు వేశారు. భర్త సునీల్ ను చంపేస్తే జైలుపాలు అవుతామని, మనం ఎంజాయ్ చెయ్యలేమని లేడీ లీడర్ సౌమ్యా ఆమె ప్రియుడు వినోద్ కు చెప్పింది.

భర్త చేతిలో డ్రగ్స్ పెట్టిన కంత్రీ భార్య
భర్తను కొన్ని సంవత్సరాల పాటు జైల్లో పెడితే మన కోరికలు తీరుతాయని, మనకు ఎవ్వరూ అడ్డుకూడా ఉండరని లేడీ లీడర్ సౌమ్యా ఆమె ప్రియుడు వినోద్ కు చెప్పింది. సౌమ్యా, ఆమె ప్రియుడు పక్కప్లాన్ వేసి డ్రగ్స్ తెప్పించి భర్త సునీల్ బైక్ లో పెట్టింది. సునీల్ బైక్ లో బయలుదేరిన తరువాత సౌమ్యా ప్రియుడు వినోద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నా భార్య డ్రగ్స్ ప్యాకెట్ ఇచ్చింది సార్
పోలీసులు సునీల్ ను అదుపులోకి తీసుకుని అతని బైక్ లో ఉన్న డ్రగ్స్ సీజ్ చేశారు. సునీల్ మీద గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులతో పాటు ఏ చిన్న కేసు కూడా నమోదు కాలేదని పోలీసులు తెలుసుకున్నారు. తాను నేరం చెయ్యలేదని, డ్రగ్స్ గురించి తనకు ఏమాత్రం తెలీదని, దయచేసి నన్ను వదిలేయానలి సునీల్ వేడుకున్నాడు. తన భార్య సౌమ్యా తన చేతికి ఈ పోట్లం ఇచ్చిందని, అందులో ఏమి ఉందో కూడా తనకు తెలీదని సునీల్ పోలీసులకు చెప్పాడు.
Recommended Video

కన్నింగ్ భార్య మ్యాటర్ లీక్
పోలీసులు సునీల్ ను అరెస్టు చేసినట్లు నటించి అతని భార్య సౌమ్యా మీద నిఘా వేశారు. సౌమ్యా ఉదయం, సాయంత్రం, రాత్రి అని తేడాలేకుండా ఆమె ప్రియుడు వినోద్ కు ఫోన్ చేసి రొమాన్స్ డైలాగులతో మాట్లాడుతూ తన భర్త జైలుకు వెళ్లిపోతున్నాడని, ఇక ముందు మనం ఎంజాయ్ చేద్దామని చెప్పింది. కొన్ని రోజుల పాటు సౌమ్యా మొబైల్ ఫోన్ ట్రాప్ చేసిన పోలీసులు చివరికి ఆమెను అరెస్టు చేశారు. సౌమ్యాకు డ్రగ్స్ ఇచ్చిన షాన్ వాజ్, షఫీ అనే ఇద్దరిని అరెస్టు చేశామని, వినోద్ ఆచూకి మాత్రం చిక్కడం లేదని ఇడుక్కి జిల్లా పోలీపు అధికారులు అంటున్నారు.
-
సమ్మర్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే రావాలనిపించదు.. తక్కవ బడ్జెట్ లో ఇలా చుట్టేయండి.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications