Wife: మద్యం మత్తులో భర్త, పక్కరూమ్ లో భర్త ఫ్రెండ్ తో భార్య ?, మిస్సింగ్ కేసు పెట్టిన కిలాడి, మ్యాటర్ !
భోపాల్*మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత డబ్బు సంపాధించాలని భర్త ఎక్కువ కష్టపడుతున్నాడు. పనివాళ్లు వచ్చినా రాకపోయినా భర్త అతని సొంత పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు. భర్తకు మద్యం సేవించే అలవాటు ఉంది. భర్త క్లోజ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెలుతుంటే అతనితో భార్య పరిచయం పెంచుకుంది. మద్యం మత్తులో భర్త ఒక రూమ్ లో ఉంటే అతని ఫ్రెండ్ తో మరోరూమ్ లో భార్య రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. మ్యాటర్ లీక్ కావడంతో భర్త రగిలిపోయాడు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య శవాన్ని తీసుకెళ్లి ఓ పొలంలో విసిరేసింది.
తన భర్త రాత్రి బయటకు వెళ్లి తరువాత ఇంటికి తిరిగిరాలేదని భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాటకాలు ఆడింది. భర్త శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్త మద్యం మత్తులో కిందపడి చనిపోయాడని భార్య డ్రామాలు ఆడింది. భార్య రోజుకు ఒక మాట్లాడటంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

దంపతుల హ్యాపీలైఫ్
మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలోని బల్లు పటేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బల్లు సావిత్రి అనే మహిళు పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న బల్లు పటేల్, సావిత్రి పటేల్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. బల్లు పటేల్, సావిత్రి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మద్యం సేవిస్తున్న బల్లు
పిల్లలు పుట్టిన తరువాత డబ్బు సంపాధించాలని బల్లు పటేల్ ఎక్కువ కష్టపడుతున్నాడు. పనివాళ్లు వచ్చినా రాకపోయినా బల్లు పటేల్ ఊరి బయట ఉన్న అతని సొంత పొలంలో కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు. రోజు వ్యవసాయం చేసి కష్టపడుతున్న బల్లు పటేల్ రోజూ మద్యం సేవించే అలవాటు పెట్టుకుని రాత్రి లేటుగా ఇంటికి వెలుతున్నాడు.

భర్త ఫ్రెండ్ తో పక్కరూమ్ లో భార్య ?
బల్లు పటేల్ క్లోజ్ ఫ్రెండ్ రైక్వార్ అప్పుడప్పుడు అతనికి ఇంటికి వచ్చి వెలుతున్నాడు. భర్త స్నేహితుడు రైక్వార్ తో బల్లు పటేల్ భార్య సావిత్రి పరిచయం పెంచుకుంది. కొంతకాలం సావిత్రి, రైక్వార్ చనువుగా ఉంటూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. మద్యం మత్తులో భర్త బల్లు పటేల్ ఇంటిలోని ఒక రూమ్ లో ఉంటే అతని ఫ్రెండ్ రైక్వార్ తో మరోరూమ్ సావిత్రి రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
కొంతకాలం క్రితం భార్య సావిత్రి అక్రమ సంబంధం విషయం ఆమె భర్త బల్లు పటేల్ కు మ్యాటర్ లీక్ కావడంతో అతను భార్య మీద రగిలిపోయాడు. బల్లు పటేల్ అతని భార్య సావిత్రిని పట్టుకుని చితకబాదేశాడు. జూన్ 28వ తేదీన రాత్రి సావిత్రి ఆమె ప్రియుడు రైక్వార్ ను ఇంటికి పిలిపించుకుంది. ప్రియుడు రైక్వార్ తో కలిసి భర్త బల్లు పటేల్ ను చంపేసిన సావత్రి ప్రియుడితో కలిసి భర్త శవాన్ని తీసుకెళ్లి వేరే ఊరి సమీపంలోని ఓ పొలంలో విసిరేసింది.

నాటకాలు ఆడిన భార్య
తన భర్త బల్లు పటేల్ రాత్రి బయటకు వెళ్లి తరువాత ఇంటికి తిరిగిరాలేదని జూన్ 29వ తేదీ సావిత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టి పోలీసుల ముందు నాటకాలు ఆడింది. నాలుగు రోజుల తరువాత బల్లు పటేల్ శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్త బల్లు పటేల్ మద్యం మత్తులో కిందపడి చనిపోయి ఉంటాడని సావిత్రి డ్రామాలు ఆడింది.

భార్య మొబైల్ ఫోన్ కాల్ డేటాతో అడ్డంగా చిక్కిపోయింది
సావిత్రి రోజుకు ఒక మాట్లాడటంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ప్రతిరోజు సావిత్రి ఆమె ప్రియుడు రైక్వార్ తో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రైక్వార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయని పోలీసులు అన్నారు. ప్రియురాలు సావిత్రితో కలిసి బల్లు పటేల్ ను హత్య చేశామని రైక్వార్ అంగీకరించాడని పోలీసులు అన్నారు, భర్త హత్య కేసులో ఆమె భార్య సావిత్రి, ప్రియుడు రైక్వార్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications