అది గతం.. చచ్చిన పామును మళ్లీ చంపేందుకు కాంగ్రెస్ యత్నం: ఖుష్బూ

ఇటీవల కాంగ్రెస్ నాయకులు బిజెపి నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ను టార్గెట్ చేసి గతంలో ఆమె చేసిన ట్వీట్ ను వైరల్ చేసిన విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ప్రధాన నరేంద్ర మోడీ ఇంటి పేరును టార్గెట్ చేసిన కుష్బూ సోషల్ మీడియా వేదికగా సంచలనం పోస్ట్ పెట్టారు. ఇక ఆ పోస్టులో కుష్బూ దొంగల ఇంటిపేర్లు అన్ని మోడీ అనే ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరు పై చేసిన వ్యాఖ్యలతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించగా, అనంతరం చర్యలలో భాగంగా లోక్సభ నుండి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. ఇక ఈ క్రమంలోని ఖుష్బూ సుందర్ కూడా గతంలో ప్రధాన నరేంద్ర మోడీ ఇంటి పేరు పై సంచలన వ్యాఖ్యలు చేశారని ఆ ట్వీట్ ని వైరల్ చేసి, ఖుష్బూ సుందర్ పై కూడా కేసు పెట్టాలంటూ, ఆమెపై కూడా పరువు నష్టం దావా వెయ్యాలంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.

Khushboo responded on her old tweet on modi and said Congress is trying to kill dead snake again

దీంతో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు, తాను చేసిన పోస్ట్ పై సమాధానం చెప్పిన ఖుష్బూ అది ముగిసిపోయిన ఉదంతమని, అప్పట్లో అది తనకున్న అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు. చాలా కాలం క్రిందట అవగాహన మెరుగుపడి, మోడీ విషయంలో తన అభిప్రాయం మారిపోయిందని చెప్పిన ఖుష్బూ అదంతా ముగిసిపోయిన అధ్యాయమన్నారు. చచ్చిన పామును మళ్లీ చంపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని వ్యాఖ్యానించారు.

తన ఆలోచన ధోరణి మారడం వల్లే తాను బిజెపిలో చేరానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. నాడు జరిగిన విషయంలో క్షమాపణ చెప్పడానికి తాను ఏమాత్రం సంకోచించనని ఖుష్బూ పేర్కొన్నారు. చచ్చిన పామును చంపాలని ప్రయత్నిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వాళ్ళ మానాన వాళ్ళను వదిలేయడమే మంచిదంటూ ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఖుష్బూ సుందర్.

కాగా బిజెపి నేత ఖుష్బూ సుందర్ మోడీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తుందని 2018 వ సంవత్సరంలో ట్వీట్ చేశారని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మోడీ, ఆయన ఇంటి పేరు పై ఆరోపణలు చేసిన ఖుష్బూ సుందర్ పై పరువు నష్టం దావా వేస్తారా? ప్రస్తుతం ఆమె బిజెపిలో నాయకురాలుగా ఉన్నారు కదా అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఆమెకు కూడా బిజెపి శిక్ష వేయిస్తుందా చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేయటంతో ఫైనల్ గా ఖుష్బూ స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+