మోడీపై ఖుష్బూ వ్యాఖ్యలు.. ఆ ట్వీట్ తో టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్!!

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పరువు నష్టం దావా వేసిన కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడిన నేపథ్యంలో లోక్సభలో రాహుల్ గాంధీ సభ్యత్వం పై నిన్న అనర్హత వేటు వేశారు. ఇక ఈ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తుంటే, ప్రధాని మోడీ ఇంటిపేరు పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు జైలు శిక్ష విధిస్తే, మరి మోడీ చేసిన వ్యాఖ్యల మాటేమిటి అంటూ ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి 2018 రాజ్యసభలో ప్రధాని మోడీ తనను శూర్పణఖతో పోల్చారని, నాటి వీడియోను పోస్ట్ చేసి తాను కూడా పరువు నష్టం దావా వేస్తామన్నారు. దీనిపై కోర్టు ఎంత తొందరగా స్పందిస్తుందో చూస్తానని పేర్కొన్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇటీవల నియామకం కాబడిన బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

khushboo Sundar comments on modi in 2018; congress targets khushboo with that tweet


బిజెపి నేత ఖుష్బూ సుందర్ మోడీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తుందని 2018 వ సంవత్సరంలో ట్వీట్ చేశారని, దొంగలు అందరికీ సాధారణంగా మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఖుష్బూ సుందర్ ఈ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఖుష్బూ కాంగ్రెస్ కు టార్గెట్ అయింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మోడీ, ఆయన ఇంటి పేరు పై ఆరోపణలు చేసిన ఖుష్బూ సుందర్ పై పరువు నష్టం దావా వేస్తారా? ప్రస్తుతం ఆమె బిజెపిలో నాయకురాలుగా ఉన్నారు కదా అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఆమెకు కూడా బిజెపి శిక్ష వేయిస్తుందా చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక దీనిపై ఖుష్బూ సుందర్ ఇంతవరకు స్పందించలేదు. కనీసం ఆ ట్వీట్ ను కూడా డిలీట్ చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+