Kidnap:నన్ను కిడ్నాప్ చేశారు, వాళ్లకు రూ. అన్ని లక్షలు ఇచ్చేయండి, తల్లికి ఫోన్ చేసిన కొడుకు,కట్ చేస్తే గోవాలో
బెంగళూరు/ ఉడిపి: చదువు మద్యలో ఆపేసిన యువకుడు అతని స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఎలాంటి పని చెయ్యకుండా స్నేహితులతో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. యువకుడి తండ్రికి ఆస్తులు, డబ్బు బాగానే ఉన్నాయి. తల్లికి ఫోన్ చేసిన యువకుడు తనను ఎవరో కిడ్నాప్ చేశారని, రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని అంటున్నారని, లేదంటే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, కిడ్నాపర్లు చెప్పిన అడ్రస్ కు వెంటనే డబ్బబులు పంపించాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సీన్ కట్ చేస్తే యువకుడు రాష్టం దాటిపోయి గోవాలో క్యాసినోలో ఉన్నాడని పోలీసులు గుర్తించడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

కాలేజ్ చదువు మద్యలో ఆపేశాడు
కర్ణాటలోని ఉడిపిలోని అంబాగిలి ప్రాంతంలో వరుణ్ నాయక్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వరుణ్ తండ్రి నాయక్ కు ఆస్తులు, డబ్బు బాగానే ఉన్నాయి. కాలేజ్ చదువు మద్యలో ఆపేసిన వరుణ్ అతని స్నేహితులతో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల నుంచి వరుణ్ ఎలాంటి పని చెయ్యకుండా స్నేహితులతో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.

కిడ్నాప్ చేశారని తల్లికి ఫోన్ చేశాడు
నాలుగు రోజుల క్రితం వరుణ్ అతని తల్లికి ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని, రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని అంటున్నారని, లేదంటే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, కిడ్నాపర్లు చెప్పిన అడ్రస్ కు వెంటనే డబ్బబులు పంపించాలని, పోలీసులకు ఫిర్యాదు చెయ్యకూడదని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తరువాత కుటుంబ సభ్యులు వరుణ్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.

తల్లిదండ్రులు ఏం చేశారంటే ?
మొదట పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలా ? వద్దా ? అని వరుణ్ కుటుంబ సభ్యులు ఆలోచించారు. వరుణ్ తండ్రి కిడ్నాపర్లకు రూ. 5 లక్షలు ఇవ్వడానికి సిద్దం చేశారు. ఇదే సమయంలో బంధువుల సూచన మేరకు వరుణ్ కిడ్నాప్ అయ్యాడని, మీరే రక్షించాలని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్యాసినోలో ఎంజాయ్
వరుణ్ ఫోన్ నెంబర్ నుంచి తనను కిడ్నాప్ చేశారని మా కొడుకు చెప్పాడని ఆమె తల్లి పోలీసులకు చెప్పింది. పోలీసులు వరుణ్ మొబైల్ ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే గోవా లోకేష్ చూపించింది. గోవా వెళ్లిన ఉడిపి పోలీసులు ఓ క్యాసినోలో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వరుణ్ చూసి షాక్ అయ్యారు. వరుణ్ ను పట్టుకుని ఉడిపి పిలుచుకుని వచ్చారు.

అసలు మ్యాటర్ చెప్పిన కిలాడి
తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాలని ఆశగా ఉందని, అందుకు డబ్బులు లేకపోవడంతో తానే కిడ్నాప్ డ్రామా ఆడానని వరుణ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. తల్లిదండ్రులను మోసం చెయ్యాలని ప్రయత్నించాడని, మా టైమ్ వేస్ట్ చేశాడని పోలీసులు వరుణ్ మీద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కిడ్నాప్ డ్రామా ఆడిన వరుణ్ ను కోర్టు 14 రోజులు రిమాండ్ కు పంపించింది.












Click it and Unblock the Notifications