ట్రాఫిక్‌కి భయపడి.. వ్యక్తిని వదిలేసి పారిపోయిన కిడ్నాపర్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

గుడ్ గావ్: కిక్కిరిసిన ట్రాఫిక్ లో చిక్కుకోవడం అందరికీ చికాకు కలిగించే విషయమే. ఒక్కోసారి ట్రాఫిక్ కూడా మేలు చేస్తుందనడానికి నిదర్శనం ఈ సంఘటన. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళ్తున్న కిడ్నాపర్లు ట్రాఫిక్ కి భయపడి, ఏం చేయాలో అర్థం కాక అతడ్ని దించేసి వెళ్లిపోయారు.

ఈ ఘటన గుడ్ గావ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అక్కడి ఖేర్కి డౌలా టోల్ ప్లాజా వద్ద ఓ వ్యక్తి నకిలీ లైసెన్సుతో బెంజ్ కారులో వచ్చాడు. టోల్ రుసుం రూ.60 కట్టడానికి ససేమిరా అనడమే కాకుండా అక్కడున్న ఓ అధికారిని బెదిరించి వెళ్లిపోయాడు.

Kidnappers let go of abducted man after being stuck in Gurgaon traffic jam

ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో మళ్లీ అదే వ్యక్తి 15 మంది మనుషులను తీసుకొచ్చి.. గన్ చూపి బెదిరించి టోల్ బూత్ వద్ద ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ని బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు.

అక్కడ్నించి 150 మీటర్ల దూరం వెళ్లాక అసిస్టెంట్ మేనేజర్ ని చితకబాదారు. మరికొద్ది దూరం వెళ్లేసరికి భారీగా ట్రాఫిక్ జామ్ అయి కనిపించింది. దీంతో వారు భయపడ్డారు. అక్కడే ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోతే పోలీసులకు పట్టబడతామేమో అని అనుమానం రావడంతో.. ఆ ట్రాఫిక్ లో ఎటు వెళ్లాలో అర్థం కాక.. కిడ్నాప్ చేసిన అసిస్టెంట్ మేనేజర్ ని అక్కడే వదిలేశారు. దీంతో బతుకుజీవుడా అనుకుంటూ సదరు మేనేజర్ అక్కడ్నించి బయటపడ్డాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man with a fake driving license was driving a Mercedes car. While crossing the Kherki Daula toll plaza in Gurgaon around 10.15 am, he denied to pay the toll tax of Rs 60 and even threatened the toll booth official to not ask for the toll. Around 11.37, the same Mercedes returned to the toll booth with more than 15 miscreants and at gunpoint, abducted the toll booth's assistant manager.They drove off some 150 metres away from the booth and thrashed the assistant manager. Eventually, after getting stuck in the Gurgaon traffic, and finding no place to go, the assistant manager had to be let go by the men.
Please Wait while comments are loading...