భర్తకు విడాకులు, రెండో మొగుడితో కాపురం, మూడో ప్రియుడు మధ్యలో వచ్చాడు. చివరికి !
చెన్నై/ విరూద్ నగర్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కొంతకాలం కాపురం చేసి తరువాత భర్తను వదిలేసింది. మరో వ్యక్తి భార్య చనిపోవడంతో అతని కొడుకుతో ఒంటరిగా ఉన్నాడు. భార్య చనిపోయిన వ్యక్తి తరువాత భర్తను వదిలేసి ఒంటరిగా ఉన్న మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇదే సమయంలో కిలాడీ లేడీ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.
తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలోని ఏడువేల పొలాలకు చెందిన గోపాల్ ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. గోపాల్ భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. భార్య చనిపోయిన తరువాత గోపాల్ అతని తన 9 ఏళ్ల కొడుకు పరంధామన్‌ను చూసుకుంటున్నాడు. గోపాల్ అదే ప్రాంతానికి చెందిన కౌసల్యా (33) అనే మహిళతో గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు.
ఈ కేసులో గతేడాది ఫిబ్రవరి 13వ తేదీన బాలుడు పరంధామన్ అదృశ్యం అయ్యాడు. ఆ ప్రాంతంలోని బావిలో పరంధామన్ మృతదేహం తేలుతు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పోస్టుమార్టం నివేదికలో పరంధామన్ ను గొంతుకోసి హత్య చేసినట్లు వెలుగు చూసింది. పరంధామ మృతికి సంబంధించి పోలీసులు కౌసల్యాపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు కౌసల్యాను పట్టుకుని ముమ్మరంగా విచారించారు. పోలీసులు జరిపిన విచారణలో పలు విస్మయకర సమాచారం వెళ్లడైంది.

ఈ సందర్భంలో కౌసల్య మరియు కామేష్ ఇద్దరూ ఒంటరిగా ఉండటాన్ని గోపాల్ కొడుకు పరంధామన్ చూశాడు. ఈ విషయాన్ని తన తండ్రి గోపాల్ కు చెబుతానని పరంధామన్ అతని సవతి తల్లి కౌసల్యాకు చెప్పాడు. ఇది విన్న కౌసల్యా కోపంతో తన బాయ్ ఫ్రెండ్ కామేష్‌తో కలిసి పరంధామన్ గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత పరంధామన్ మృతదేహాన్ని ఆ ప్రాంతంలోని బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కౌసల్యాను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కౌసల్యా ప్రియుడు కామేష్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications