పోలీసుల్ని చంపండి: హార్దిక్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్య

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో పటేల్ వర్గానికి యువనేతగా పేరు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు చేసుకునే బదులు పోలీసులను హతమార్చాలని ఆయన పటేల్ యువతకు పిలుపునిచ్చారు.

గుజరాత్‌కు చెందిన పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ శనివారం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పటేళ్ల వారసులు ఆత్మహత్య చేసుకోవద్దని, అవసరమైతే ఇద్దరు ముగ్గురు పోలీసులను చంపాలన్నారు.

రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించిన విపుల్ దేశాయ్ అనే ఓ యువ కార్యకర్తను పరామర్శించేందుకు హార్దిక్ పటేళ్ వెళ్లారు. ఈ సందర్భంగా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయాన్ని విపుల్ దేశాయ్ స్వయంగా వెల్లడించారు. పటేళ్ల వారసులుగా అవసరమైతే ఇద్దరు ముగ్గురు పోలీసులను చంపాలి తప్ప, ఆత్మహత్య ఆలోచన రానివ్వకూడదని హార్దిక్ పటేల్ చెప్పారని, హార్దిక్ తనను పరామర్శించి వెళ్లిన అనంతరం విపుల్ చెప్పారు. అయితే దీనిని హార్దిక్ పటేల్ ఖండించారు.

Kill policemen, never commit suicide: Hardik tells Patel youth

కాగా, గుజరాత్‌లో రిజర్వేషన్ల కోసం మరో అగ్రకులస్తుల డిమాండ్ తెర పైకి వచ్చింది. ఇప్పటికే పటేల్ సామాజికవర్గ ప్రజలు రిజర్వేషన్లకు ఉద్యమిస్తుండగా.. తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు ఆల్ గుజరాత్ బ్రహ్మ సమాజ్ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై పలు తీర్మానాలు చేసినట్లు సమాజ్ అధ్యక్షుడు శైలేశ్ జోషి తెలిపారు. త్వరలోనే గాంధేయమార్గంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో విధులు నిర్వహ్తిస్తున్న పూజారులకు ప్రతి నెలా జీతాలు చెల్లించాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+