భార్యకు ప్రియుడితో వివాహం చేసిన భర్త
చెన్నై: ఏడడుగులు వేసి వివాహం చేసుకున్న తన భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి వివాహం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన తమిళనాడులో రాష్ట్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లాలోని తురైయూరు సమీపంలోని ఉప్పిలియాపురం వద్ద ఓ గ్రామానికి చెందిన దేవి, తురైయూర్ యూనియన్‌లోని మరో గ్రామానికి చెందిన నందకుమార్ (26)కు పెళ్లి చేయూలని పెద్దలు నిశ్చరుుంచారు.
20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. బుధవారం ఉదయం వరుడి ఇంట్లో వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరిగింది. వరుని ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రాత్రి దేవి.. నందకుమార్ కాళ్లపైపడి భోరున విలపించింది. నందకుమార్ ఏమి జరిగిందని ఆమెను ప్రశ్నించాడు.

నవ వధువు మాట్లాడుతూ.. తన ఊరికి చెందిన లారీ డ్రైవర్‌ను ప్రేమిస్తున్నానని, తల్లిదండ్రులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని తెలిపింది. తనను అతనితో కలపాలని ప్రాథేయపడింది.
ఈ నేపథ్యంలో నందకుమార్ తన భార్యను ప్రియుని చెంతకు చేర్చేందుకు నిర్ణయించాడు. ఆపై వేరే ప్రాంతానికి వెళ్లిన ప్రియుడ్ని రప్పించి దేవితో తురైయూరు పెరుమాల్ ఆలయంలో వివాహం జరిపించాడు. కాగా, పలువురు నందకుమార్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications