మమ్మల్ని కాదని ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏర్పాటు చెయ్యలేరు, మాకు ఎన్ని సీట్లు అంటే ?, బళ్లారి రెడ్డి !
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత మమ్మల్ని కాదని ఎవ్వరూ అధికారంలోకి రాలేరని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కల్యాణ ప్రగతి పార్టీ (కేఆర్ పీ) అభ్యర్థులు ఊహించని విజయాలు సాధిస్తారని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (Reddy) ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హిరియూరులో ఏర్పాటు చేసిన రోడ్ షోలో గాలి జనార్దన్ రెడ్డి పాల్గోన్నారు. హిరియూరులోని ప్రముఖ దేవాలయాల్లో గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత జరిగిన బహిరంగ సభలో కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకుల మీద మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

హిరియూరు అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రి డి. సుధాకరన్ ను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి డి. సుధాకర్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆయన్ను మంత్రిని చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా, బహిరంగంగా చెబుతురా ? అని గాలి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. డి. సుధాకర్ ఇక్కడి నుంచి గెలిచినా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చెయ్యలేదని గాలి జానర్దన్ రెడ్డి ఆరోపించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్ణిమా మళ్లీ బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేసి విజయం సాధించినా ఆమెను కూడా బీజేపీ నాయకులు మంత్రిని చెయ్యలేరని, పూర్ణిమా ఎమ్మెల్యేగానే ఉంటారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అయితే కేఆర్ పీ పార్టీ అభ్యర్థి హెచ్. మహేష్ ను మీరు గెలిపిస్తే ఆయన్ను తాను కచ్చితంగా నేను మంత్రిని చేస్తానని, ఇన్ని ఏళ్లలో జరగని అభివృద్దిని తాను చేసి నిరూపిస్తానని గాలి జనార్దన్ రెడ్డి చాలెంజ్ చేశారు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేఆర్ పీ నుంచి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారని, మమ్మల్ని కాదని ఎవ్వరూ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేరని మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో ఆ పార్టీ నాయకులు మంచి ఊపుమీద ఉన్నారు.












Click it and Unblock the Notifications