వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలైన ఆరెస్సెస్ తెలియదు: బేడీ ప్రశంస, హజారే ఫైర్: ట్విట్టర్లో కేజ్రీXబేడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బుధవారం నాడు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) పైన ప్రశంసలు కురిపించారు. ఆరెస్సెస్ మంచి జాతీయవాద సంస్థ, అది భారత దేశాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తోందని కొనియాడారు.

ఆరెస్సెస్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్ అన్నారు. ఆ సంస్థ క్రమశిక్షణతో కూడుకున్నదని, అది జాతిని నిర్మించేందుకు ఎంతో కృషి చేస్తోందన్నారు. స్వచ్ఛ భారత్‌ను చూడాలనుకుంటోందని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రజలకు అసలైన ఆరెస్సెస్ గురించి ఇంకా తెలియదన్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఢిల్లీయే కారణమన్నారు.

ఓ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఢిల్లీ ఏమాత్రం బాగుపడలేదని.. ఏఏపీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. భారత దేశాన్ని ప్రభావితం చేయగలిగేది ఢిల్లీ అన్నారు. తాను అరాచకవాదిని అని చెప్పడమే కాకుండా, మూడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ధర్నా చేసిన కేజ్రీవాల్ పైన ఆమె విమర్శలు గుప్పించారు.

Kiran Bedi says ‘very nationalistic RSS has kept India united’; Anna Hazare says politics is dirty

కిరణ్ బేడీ పైన అన్నా హాజారే ఆగ్రహం

తాను కిరణ్ బేడీ గురించి మాట్లాడదల్చుకోలేదని, అలాగే రాజకీయాలు మురుగు వంటివని అన్నాహజారే అన్నారు. కాగా, కిరణ్ బేడీ బీజేపీలో చేరిన అనంతరం పలుమార్లు హజారేకు ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాట్లాడలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ట్విట్టర్లో కిరణ్ బేడీ వర్సెస్ కేజ్రీవాల్

తాను చర్చకు రమ్మంటే కిరణ్ బేడీ ఎందుకు స్పందించలేదని, ఆమె ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలుసునని, అయితే రెండు గంటల సమయం కేటాయిస్తే చాలునని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

దానికి కిరణ్ బేడీ స్పందిస్తూ.. కేజ్రీవాల్ దృష్టి ఎప్పుడూ చర్చల పైనే ఉంటుందని, తన దృష్టి ప్రజలకు సేవ చేసే అంశంపై ఉంటుందన్నారు.

కిరణ్ బేడీ తన ట్విట్టర్ అకౌంటులో తన పేరును బ్లాక్ చేసిందని, అన్ బ్లాక్ చేయమని కోరుతున్నానని అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు.

తన అకౌంటులో కేజ్రీవాల్‌ను పదిహేను నెలల క్రితం బ్లాక్ చేశానని, కేజ్రీవాల్ తనను అరాచవాదిగా ప్రకటించుకున్నాడని, ఆనాడే తన అకౌంటులో అతనిని బ్లాక్ చేశానని కిరణ్ బేడీ సమాధానం ఇచ్చారు.

ఎన్నికల ముందు చర్చల్లో పాల్గొంటేనే ఓటర్లకు మన ఆశయాలు, లక్ష్యాలు వివరించగలమని కేజ్రీవాల్ చెప్పారు.

ఎన్నికల తర్వాత అసెంబ్లీలో కూడా పలు అంశాల పైన చర్చించే అవకాశముందని కిరణ్ బేడీ సమాధానమిచ్చారు.

హజారే పోరాడాన్ని వాడుకున్నారని మండిపడ్డ అజయ్ మాకెన్

అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని తమ రాజకీయ ఎదుగుదలకు వాడుకున్నారని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న వారు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసమే నాడు అన్నా వెంట నడిచారని ఆరోపించారు.

English summary
A rare BJP leader with no RSS link, Kiran Bedi, the party's chief ministerial nominee for Delhi, on Monday described the Sangh as "very nationalistic" that has kept India united.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X