గోడ దూకిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

పాండిచ్చేరి: పాండిఛ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ మరో సాహసం చేశారు. ఇటీవల కాలంలో కిరణ్‌బేడీ అర్ధరాత్రి పూట మోటార్‌బైక్‌పై పుదుచ్చేరి రోడ్లపై తిరిగారు. రాత్రిపూట మహిళలకు ఏ రకమైన రక్షణ ఉందనే విషయాన్ని ఆమె పరిశీలించారు.

మరోసారి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి మరో సాహసం చేశారు. గురువారం ఆమె కరైకల్‌ ప్రాం‍తంలో పర్యటించారు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందుతున్న సదుపాయాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kiran Bedi shows sportswomanship, jumps over fence at government hospital in Puducherry

ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న 'అవర్‌ లేడీ ఆఫ్‌ లార్డ్స్‌' గదిని గమనించారు. ఆ గదికి చుట్టూ 4 అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేట్‌ పెట్టారు. అవర్‌ లేడీ ఆఫ్‌ లార్డ్స్‌ గదిని సందర్శించాలని కిరణ్‌ బేడీ ఆసుపత్రి అధికారులకు తెలిపారు. గేట్‌ చాలాకాలం పాటు మూసివుంచడంతో.. తాళం చెవులు ఎక్కడపెట్టారో అధికారులు మర్చిపోయారు. కొద్దిసేపు తాళం చెవుల కోసం ఎదురు చూసిన కిరణ్‌ బేడి.. చివరకు గోడను ఎక్కి అవతలకు దూకి షెడ్‌లోకి వెళ్లారు. దీంతో చేసేదీలేక.. కరైకల్‌ కలెక్టర్‌ ఆర్‌. కేశవన్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వీజే చంద్రన్‌, మరికొందరు అధికారులు కూడా గోడ దూకి షెడ్‌లోకి వెళ్లారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Puducherry Lieutenant Governor (LG) Kiran Bedi today showed glimpses of her past as a sportswoman and a brave IPS officer when she scaled a fence at the premises of the government hospital here during a field visit. Bedi (68) jumped over the brick fence as the officials had misplaced its keys. Bedi, the first woman to join the Indian Police Service (IPS).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి