వీఐపీ ఖైదీల కేరాఫ్.. పరప్పన అగ్రహార జైలు

చెన్నై: అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోయిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. నిందితురాలిగా ఆరు నెలలు జైలులో ఉన్న శశికళ.. మరో మూడున్నర సంవత్సరాలు జైల్లో ఉండనున్నారు. ఈ పరప్పన అగ్రహార జైలు వీఐపీ ఖైదీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటోంది.

బెంగళూరు నగరంలోని ప్రధాన కారాగారాన్ని నగర శివారులోని పరప్పణ అగ్రహారలో ఏర్పాటు చేసిన విశాల ప్రాంగణానికి రెండు దశాబ్దాల క్రితం తరలించారు. 1997లో ఇక్కడకు తరలించారు.

నలభై ఎకరాలలో ఉన్న ఈ జైలులో 2 వేలమంది ఖైదీలను ఉంచేందుకు అనువుగా నిర్మించారు. అనంతరం ఖైదీల సంఖ్య పెరుగుతుండటంతో ఇక్కడ.. ఇప్పుడు అంతకుమించి ఖైదీలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో జైలును విస్తరించే యోచన చేస్తోంది.

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, మాజీ మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, కృష్ణయ్యషెట్టి తదితరులు శిక్షలో భాగంగా ఈ కారాగారంలోనే కొంతకాలం శిక్ష అనుభవించారు.

2014లో జయలలితతో కలిసి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు 21 రోజుల పాటు ఖైదీలుగా ఉన్నారు. ప్రధాన కారాగారం కావడంతో 24 గంటలు భారీ భద్రత ఉంటుంది. ఈ కారాగారం తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది.

 Know Bengaluru's Parappana Agrahara jail where Sasikala kept

తమిళనాడుకు కేవలం 30 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. తమిళనాడులోని హోసూరుకు ఇక్కడకు సమీపంలో ఉంది. ఖైదీలకు అధికారులు నీతిపాఠాలు బోధిస్తారు. జైలు నిబంధనల మేరకు ఖైదీల దినచర్య ఉంటుంది.

ఖైదీలు విరామ సమయంలో చదరంగంను పోలి ఉండే హుల్లికట్టు అనే ఆట ఆడుతుంటారు. కరడుగట్టిన ఖైదీలు, జీవిత శిక్షకు గురైనవారు, మాదకద్రవ్యాల రవాణాలో శిక్ష పడ్డవారు జైలులో ఎక్కువగా ఉన్నారు. పురుష, మహిళా ఖైదీలకు వేర్వేరు ప్రాంగణాలు. హోసూరుకు ఈ జైలు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+