వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ స్నేహ దుబే - పాకిస్తాన్ తీరును చీల్చి చెండాడి : ఐక్యరాజ్య సమతి వేదికగా- ఇమ్రాన్ ను ఏకి పారేస్తూ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీ మరి కొద్ది గంటల్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించ బోతున్నారు. దీనికి ముందే అదే వేదిక పైన ఒక అరుదైన-ఆకర్షణీయమైన ఘట్టం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో ఇండియా ప్ర‌తినిధిగా -ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా స్నేహ దూబే తిప్పి కొట్టారు. జమ్ము కాశ్మీర్ -లఢఖ్ ఎప్పటికీ భారత్ వే అంటూ తేల్చి చెప్పారు. పాకిస్థాన్ వైఖ‌రిని ఐక్యరాజ్య సమితి వేదికగా ఏకి పారేసారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను..పాకిస్థాన్ చేస్తున్న వ్యవహారాలను చీల్చి చెండాడారు.

స్నేహ దుబే..ఎవరంటూ సెర్చింగ్ లో

స్నేహ దుబే..ఎవరంటూ సెర్చింగ్ లో

యూఎన్ఓ లో స్నేహ మాట్లాడిన తీరు తెలుసుకున్న వారంతా ఇప్పుడు అసలు ఎవరీ స్నేహ దుబే అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. స్నేహ దూబే. 2012 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్‌. యూఎన్‌లో ఇండియా త‌ర‌పున ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా ఉన్న స్నేహ దూబే.. గోవాలో స్కూల్ విద్య‌ను పూర్తి చేశారు. పుణెలోని ఫెర్గూస‌న్ కాలేజీ నుంచి ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. ఇక ఢిల్లీలోని జ‌వ‌ర్‌లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ నుంచి ఎంఫిల్ పూర్తి చేసారు. 12 ఏళ్ల వ‌య‌సులోనూ ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీసెస్‌లో ఉద్యోగం చేయాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

ఫారిన్ స‌ర్వీసెస్‌పై దృష్టి పెట్టటంతో

ఫారిన్ స‌ర్వీసెస్‌పై దృష్టి పెట్టటంతో

2011లో సివిల్ స‌ర్వీసెస్ రాసిన మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సక్సెస్ అయ్యారు. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల గురించి నేర్చుకోవాల‌న్న ఉద్దేశంతోనే ఫారిన్ స‌ర్వీసెస్‌పై దృష్టి పెట్టిన‌ట్లు గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కొత్త సంస్కృతుల‌ను తెలుసుకోవాల‌న్న థ్రిల్‌, కీల‌క‌మైన విధాన నిర్ణ‌యాల్లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హించాల‌న్న త‌ప‌న త‌న‌లో ఉన్న‌ట్లు స్నేహ దూబే అప్పట్లోనే వివరించారు. స్నేహ‌కు ట్రావెలింగ్ అన్నా ఇష్ట‌మే. ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ కావ‌డం వ‌ల్ల తాను దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ద‌క్కిన‌ట్లు ఆమె చెప్పారు.

పాకిస్తాన్ - ఇమ్రాన్ కు స్ట్రాంగ్ మెసేజ్

పాకిస్తాన్ - ఇమ్రాన్ కు స్ట్రాంగ్ మెసేజ్

త‌మ కుటుంబం నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరిన మొద‌టి వ్య‌క్తి స్నేహ దూబే. తండ్రి ఓ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలో ప‌నిచేస్తున్నారు. ఇక త‌ల్లి స్కూల్ టీచ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఫారిన్ స‌ర్వీస్‌కు ఎంపికైన త‌ర్వాత‌.. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ‌లో తొలిసారిగా జాయిన్ అయ్యారు. 2014లో మాడ్రిడ్‌లో ఉన్న ఎంబ‌సీలో ఆమె తొలి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ప్ర‌స్తుతం యూఎన్‌లో ఇండియా ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్నారు. ఇక, యూఎన్ సమావేశంలో ప్రధాని ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న సమయంలో..స్నేహ దుబే పాకిస్థాన్ కు ఇచ్చిన సమాధానం..ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పదునైన అస్త్రాలతో తిప్పి కొట్టిన తీరు ఇప్పుడు దేవ వ్యాప్తంగా ఒక్క సారిగా స్నేహ పేరును పతాక స్థాయికి తీసుకెళ్లాయి.

Recommended Video

'Now Tamil Echoing In US' : PM Narendra Modi || అమెరికాలో తమిళ్ కి మంచిఆదరణ ఉందన్న మోడీ || Oneindia

నెటిజెన్ల ప్రశంసలు..సోషల్ మీడియాలో వైరల్

యూఎన్‌లో స్నేహ దూబే మాట్లాడిన తీరు ప‌ట్ల సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఆమె మాట్లాడిన వీడియోల‌ను పోస్టు చేస్తూ నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. పాకిస్థాన్ వైఖ‌రిని స్నేహ ఎండ‌గ‌ట్టిన తీరు అద్భుత‌మ‌ంటూ ప్రశంసిస్తున్నారు. ప‌దునెక్కిన ప‌దాల‌తో పొరుగు దేశాన్ని చీల్చిచెండాడిన‌ తీరు సూప‌ర్ అని పొడుగుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు. ప్ర‌తి మాట‌ను చాలా జాగ్ర‌త్త‌గా ఆమె ఎన్నుకున్న విషయం స్పష్టం అవుతోంది. నిజాల‌ను నిర్భ‌యంగా చెప్పింద‌ంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. గ‌తంలోనూ యూఎన్‌లో ఇండియా త‌ర‌పున మ‌హిళా ప్ర‌తినిధులు ఇలాగే మాట్లాడారు. ఈనమ్ గంభీర్‌, విదిషా మైత్రా త‌ర‌హాలోనే స్నేహ కూడా పాక్ భ‌ర‌తం ప‌ట్టింద‌ని సోష‌ల్ మీడియాలో ప్రశంసలు..అనుకూల కామెంట్లతో నెటిజెన్లు హోరెత్తిస్తున్నారు.

English summary
In a strong rebuttal, Sneha Dubey, India’s first secretary to the UN, said Pakistan nurtures terrorists in their backyard in the hope that they will only harm their neighbours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X