బెంగళూరు నుంచి హైదరాబాద్ కు!: ఎమ్మెల్యేలను తరలిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్?

బెంగళూరు: బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్టు నుంచి ఎక్కడికి తరలించాలనే విషయంపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఉదయం వచ్చిన జరిగిన ప్రచారం మేరకు.. జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లేదా వైజాగ్ తరలిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిని పంజాబ్ లేదా ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కేరళకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.

kochi

ఈ మేరకు కొచ్చి లోని క్రౌన్ ప్లాజాలో ఎమ్మెల్యేల కోసం 125 గదులు బుక్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్నాకులం పట్టణానికి 5కి.మీ దూరంలో కుందన్నూర్ వద్ద ఈ ఐదు నక్షత్రాల హోటల్ ఉంది. కొచ్చి వర్గాల సమాచారం మేరకు.. ఎమ్మెల్యేలకు అవసరమైన ఏర్పాట్లన్ని అక్కడ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సోనియా గాంధీ సైతం కేరళ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రిసార్టులో ఏర్పాట్ల గురించి వీరి మధ్య సంభాషణ జరిగినట్టు చెబుతున్నారు.

May 18, 2018, 1:52 am IST

బెంగళూరు నుంచి బస్సుల్లో బయలుదేరిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ హైవేపై మరో బస్సులోకి మారారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. రెండు పార్టీల ఎమ్మెల్యేలు హైదరాబాద్ కే వెళ్తున్నట్టు దీనితో తేలిపోయింది.
May 18, 2018, 1:39 am IST

'బీజేపీ బేరసారాలకు బ్రేక్ వేయాలంటే మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఒకే బస్సులో ఒకే దగ్గరికి వెళ్తున్నారు' జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు. బీజేపీ ప్రలోభాలను అడ్డుకోవడానికి బెంగళూరు నుంచి వారిని తరలించినట్టు చెప్పారు.
May 18, 2018, 12:17 am IST

బెంగళూరులోని శాంగ్రీ-లా హోటల్ నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేలను తరలిస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే శివరామె గౌడ తెలిపారు. అయితే కొంతమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్, మరికొంతమందిని కొచ్చి తరలిస్తున్నట్టు ఆయన వెల్లడించడం గమనార్హం.
May 18, 2018, 12:16 am IST

ఈగల్ టన్ రిసార్టులోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలిస్తున్న ఫోటోలు బయటకొచ్చాయి. కేరళలోని కొచ్చిలో ఉన్న క్రౌన్ ప్లాజా హోటల్ కు వారిని తరలిస్తున్నట్టు సమాచారం. రిసార్టు వద్ద పోలీసు బందోబస్తు ఎత్తివేయడంతో బీజేపీ నేతలు లోపలికి ప్రవేశించి ఎమ్మెల్యేలకు డబ్బులు ఆఫర్ చేశారని కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి ఆరోపించారు.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు కొచ్చి వస్తున్నారన్న విషయం తెలిసి కేరళ పర్యాటక మంత్రి కడకంపల్లి సైతం ట్వీట్ చేయడం విశేషం. 'కర్ణాటక ఎమ్మెల్యేలు కేరళ వస్తున్నట్టుగా సమాచారం అందింది. వారికి స్వాగతం చెప్పడానికి, సౌకర్యాలు కల్పించడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వంటి ఇబ్బందులేవి ఇక్కడ ఎదురుకావు.' అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కొచ్చికి జేడీఎస్ ఎమ్మెల్యేలు?:

జేడీఎస్ ఎమ్మెల్యేలను సైతం కేరళలోని కొచ్చి క్రౌన్ ప్లాజా హోటల్ కి తరలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డి కుమారస్వామి మాత్రం.. ఎక్కడికి వెళ్లాలన్న దానిపై తాము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. చాలామంది నుంచి చాలా సలహాలు-సూచనలు వస్తున్నాయని, రాష్ట్రపతి భవన్ ముందు నిరసన చేయాలని కొంతమంది సూచించారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+