Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kolkata Rape and Murder case: జూనియర్ డాక్టర్ పై జరిగింది గ్యాంగ్ రేప్,వెలుగులోకి షాకింగ్ విషయాలు..!

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఆపై హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 31 ఏళ్ల మృతురాలి పోస్టుమార్టం రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ పై ఒకరే అత్యాచారం చేయలేదని ఇది గ్యాంగ్ రేప్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతురాలి శరీరంపై అధిక మొత్తంలో వీర్యం..?

జాతీయ మీడియా కథనాల ప్రకారం 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ పై జరిగింది గ్యాంగ్‌ రేప్ అని తెలుస్తోంది. మృతురాలి శరీరంపై అధికమొత్తంలో ద్రవం ఉందని అది వీర్యం అయి ఉండొచ్చనే అనుమానాలు పోస్టు మార్టం నివేదిక ద్వారా వెల్లడవుతోంది. మృతురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోల్‌కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ జాతీయ మీడియా ఎన్డీటీవీ చేతిలోకి వెళ్లింది. దీని ద్వారా విషయం బయటకు పొక్కింది. మరో జాతీయ ఛానెల్‌ ఇండియా టుడే కథనం ప్రకారం పోస్టుమార్టం రిపోర్టు గురించి డాక్టర్ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం మృతురాలి శరీరంపై దాదాపుగా 151 మిల్లీగ్రాముల ద్రవం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే వ్యక్తికి సంబంధించి ఆ స్థాయిలో వీర్యం ఉండటం సాధ్యం కాదని, ఈ ఘోరానికి పాల్పడింది ఒకరికంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆల్‌ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబర్ణ గోస్వామి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ కేసులో ఒక అనుమానిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Kolkata Rape and Murder case Doubts Emerge Over Gang Rape of Junior Doctor Following Postmortem Examination

ఇదిలా ఉంటే జూనియర్ డాక్టరును అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపారని ఆమె కుటుంబ సభ్యులు విలపించారు. తాము వెళ్లే సరికి మృతురాలిపై వస్త్రాలు లేవని నగ్నంగా పడి ఉందని చెప్పారు.పోస్టు మార్టం నివేదిక ప్రకారం మృతురాలి ముఖంపై చేతిపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం చేసే క్రమంలో ఆమె ధరించి ఉన్న కళ్లజోడు పగిలి ఆ అద్దాలు కళ్లల్లోకి చొచ్చుకుని పోయాయని పోర్టుమార్టం నివేదికలో పొందుపర్చారు. తలకు మెడకు గాయాలైనట్లు తెలిపారు.

ఆగష్టు 9వ తేదీ కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌లోని సెమినార్ హాల్‌లో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం దేశాన్ని కదిలించింది. ఈ అత్యాచారం చేసింది ఒకరా, లేక ఒకరికంటే ఎక్కువనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తడంతో అసలు విషయం బయటపడింది. దేశాని కదిలించిన ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. తృణమూల్ కాంగ్రెస్,బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.అసలైన దోషిని మమతా ప్రభుత్వం వదిలేస్తోందని బీజేపీ ఆరోపించింది. దోషికి టీఎంసీతో సంబంధాలున్నాయి కాబట్టే వదిలేసి ఎవరినో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+