వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికలు వేశ్యావృత్తిలో దిగకుండా ‘ఎక్స్ రే’ పరీక్షలు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో అనేక మంది బాలికలు వేశ్య గృహాలకు బలవంతంగా తరలించబడుతున్నారు. ఈ క్రమంలో బాల్యదశలో ఉన్న అమ్మాయిలు వేశ్యావృత్తిలోకి దిగకుండా నివారించేందుకు వీలుగా ఎక్స్ రే పరీక్షలు నిర్వహించాలని సెక్స్ వర్కర్ల సంస్థ దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ నిర్ణయించింది.

చిన్న వయస్సులోనే అమ్మాయిలు వ్యభిచారం వృత్తిలో దిగకుండా అరికట్టేందుకే ఈ పరీక్షలు చేస్తున్నట్లు దుర్బార్ మహిళా సమన్వయ కమిటీ ప్రకటించింది. కాగా, ఈ సమన్వయ కమిటీలో సుమారు 1.30లక్షల మంది సభ్యులు ఉన్నారు.

పలు పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండాకుండానే 18 ఏళ్లు వచ్చాయని చెప్పి వేశ్యావృత్తిలోకి దించుతున్నారని దుర్బార్ సంఘం సీనియర్ ప్రతినిధి మహాశ్వేతా చెప్పారు. ఈ వృత్తిలోకి దింపాలనుకున్న అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాయా లేదా అనేది నిర్ధారించుకోవడం కష్టంగా మారిందని చెప్పారు.

Kolkata's red light area to roll out X-ray tests to determine girl's age

ఈ నేపథ్యంలోనే ఎక్స్ రే పద్ధతిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. అమ్మాయిల మణికట్టు, నడుము ఎక్స్ రే తీయడం ద్వారా వారి వయసును సులభంగా గుర్తించవచ్చని మహాశ్వేతా వివరించారు.

మైనర్ బాలికలు వేశ్యావృత్తిలోకి అడుగుపెట్టకుండా నిరోధించడానికి ఎక్స్ రే పరీక్ష ఉపయోగపడుతుందని సోనాగచ్చి పరిశోధనా, శిక్షణా సంస్థ(ఎస్ఆర్‌టీఐ) ప్రిన్సిపాల్ సమర్జిత్ జానా చెప్పారు. బెంగాల్ రాష్ట్రంలో చేపట్టిన ఈ ఎక్స్ రే పరీక్షలు దేశవ్యాప్తంగా చేయడం ద్వారా బాలికలను ఈ వృత్తిలోకి రాకుండా నిరోధించవచ్చని సమర్జిత్ వివరించారు. ఎస్ఆర్‌టీఐ అనేది ఓ స్వచ్ఛంద సంస్థ, ఇది దుర్బర్‌ సంస్థతో కలిసి పనిచేస్తోంది.

కాగా, ఎక్కడైనా మైనర్ బాలిక వేశ్యావృత్తిలో కనిపిస్తే వారిని ప్రశ్నిస్తామని, బలవంతంగా వారు ఈ వృత్తిలోకి దింపారని తేలితే అలాంటి బాలికలను ప్రభుత్వ సదనాలకు తరలిస్తామని దుర్బార్ సంస్థ అధికారులు చెప్పారు.
మానవ అక్రమ రవాణా, వ్యభిచార వృత్తి భారీ ఎత్తున జరుగుతున్న కోచ్ బేహార్, జల్పాయ్ గురి, మాల్దా, ఉత్తర 24పరగణాలు, దక్షిణ 24పరగణాలు, ముర్షిదాబాద్, తదితర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో బాలికలకు ఈ పరీక్షలు చేస్తున్నారు.

ఈ బోర్డులో ఇద్దరు సెక్స్ వర్కర్లు, చీఫ్ జిల్లా మెడికల్ ఆఫీసర్, ఓ డాక్టరు, న్యాయవాది, సామాజిక కార్యకర్త ఒకరు సభ్యులుగా ఉన్నారని , బోర్డు ఆధ్వర్యంలోనే బాలికలకు ఎక్స్ రే పరీక్షలు చేస్తామని సెక్స్ వర్కర్లు వివరించారు. ఈ ఎక్స్ రే పరీక్ష ద్వారా అనేక మంది బాలికలను వేశ్యా వృత్తి నుంచి కాపాడామని దుర్బర్ సంస్థ ప్రతినిధులు వివరించారు.

English summary
In a bid to stop adolescent and teenage girls from entering prostitution, a sex workers' organization is using X-Ray test as a tool to determine the age of the girls who are about to join flesh trade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X