• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

థ్రిల్లర్ మెటీరియల్: కేరళ సీరియల్ కిల్లింగ్స్‌పై సినిమా: మోహన్ లాల్ కీలకపాత్రలో..

|

తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన కోజికోడ్ కుటుంబం హత్యల కేసు వెండితెరపై రాబోతోంది. ఈ వరుస హత్యల ఘటనపై మాలీవుడ్ లో ఒకేసారి రెండు సినిమాలు తెరకెక్కబోతున్నాయి. ఒక మూవీలో సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్ క్యారెక్టర్ ను పోషించనున్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఆయన కనిపించబోతున్నారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. కూడతై పేరుతో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. ఇదే హత్యలను కథాంశంగా చేసుకుని మరో మూవీ కూడా తెరకెక్కనుంది.

తొలిసారిగా: థాక్రే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ఆదిత్య థాక్రే

 తవ్వే కొద్దీ షాకింగ్ ట్విస్టులు..

తవ్వే కొద్దీ షాకింగ్ ట్విస్టులు..

ఈ హత్యలన్నింటికీ ప్రధాన కారకురాలు జాలీనే అనే విషయం తెలుసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. దర్యాప్తు చేస్తోన్న పోలీసులకు సైతం దిగ్భ్రాంతి కలిగించేలా, చెమటలు పట్టించేలా చేసింది జాలీ థామస్ సాగించిన హత్యల తీరు. కోజికోడ్ జిల్లా రూరల్ ఎస్పీ సిమోన్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యలపై కూపీ లాగడానికి ప్రభుత్వం సిమోన్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జాలీ థామస్ ను విచారిస్తున్న కొద్దీ, కేసును తవ్వే కొద్దీ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకు సైతం ఊహకు అందని విధంగా సాగుతోంది ఈ కేసు దర్యాప్తు.

థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత మెటీరియల్..

థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత మెటీరియల్..

జాలీ థామస్ చేసిన మారణకాండ ఉదంతంలో ఓ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించడానికిి అవసరమైన మెటిరీయల్ మొత్తం కనిపించింది మలయాళీ చిత్ర పరిశ్రమ పెద్దలకు. అంతే. వరుసగా రెండు సినిమాలను ప్రకటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించే ఒక సినిమాలో మోహన్ లాల్ నటించబోతున్నారు. జాలీ థామస్ హత్యలపై ఆరా తీయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు నాయకత్వం వహిస్తోన్న కోజికోడ్ రూరల్ ఎస్పీ సిమోన్ పాత్రను మోహన్ లాల్ పోషిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించనున్నారు. ఈ సినిమాకు `కూడతై` అనే పేరు పెట్టారు. కారణం- ఈ హత్యలన్నీ కూడతై ప్రాంతం చుట్టే తిరగడమే.

నిజానికి- మోహన్ లాల్ ప్రస్తుతం ఓ థ్రిల్లర్ సినిమాలో నటించడానికి సైన్ చేశారు. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకుడు. తాజాగా- ఆ సినిమా కథను పక్కన పెట్టి కోజికోడ్ సామూహిక హత్యలపై సినిమా తీయాలని నిర్ణయించారు. దీనికి మోహన్ లాల్ సైతం ఓకే చెప్పారు. ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మించనున్నారు

రోనెక్స్ ఫిలిప్ దర్శకత్వంలో..

రోనెక్స్ ఫిలిప్ దర్శకత్వంలో..

జాలీ థామస్ హత్యలపై మరో మూవీ కూడా తెరకెక్కబోతోంది. రోనెక్స్ ఫిలిప్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. జాలీ థామస్ పాత్రను డినీ డేనియల్ పోషించనున్నారు. ఈ విషయాన్ని డినీ డేనియల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కోలపథకొంగలుడే ఒన్నారు పథిటండు..` పేరుతో ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మాలీవుడ్ ప్రముఖ నిర్మాత అలెక్స్ జాకబ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. విజీష్ తుండథిల్ కథా సహకారాన్ని అందించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడం మాలీవుడ్ లో కొత్తేమీ కాదు. రెండేళ్ల కిందట కేరళలో మరణ మృదంగాన్ని మోగించిన నిఫా వైరస్ ను కథాంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు ఫిల్మ్ మేకర్లు. `వైరస్` పేరుతో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.

English summary
Koodathai’, incidentally is a place in Kozhikode where a woman has been allegedly involved in multiple murders to grab ancestral property. Though the cops are yet to reveal the charges and proofs, the news channels have been giving spicy reports one after the other. Naturally the Malayalam film industry has shown interest in taking the plot to the screen. Producer Antony Perumbavoor announced a movie with Mohanlal in the lead, where he will play an investigation officer though there has been no news about the possible crew.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more