బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, క్రికెటర్లు అరెస్టు, సీసీబీ ఎంట్రీ, లుక్ ఔట్ నోటీసులు, విదేశాల్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ ల్లో క్రికెట్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రికెటర్లను సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. బళ్లారి టస్కర్స్ టీం క్యాప్టెన్ సీఎం. గౌతమ్, అబ్రార్ ఖాజీ అనే ఇద్దరిని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ ల్లో క్రికెట్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 2019 ఆగస్టు 31వ తేదీన బళ్లారి టస్కర్స్, హుబ్బళ్లి టైగర్స్ జట్ల మధ్య కేపీఎల్ ఫైనల్స్ మైసూరులో జరిగాయి.

KPL fixing case CCB detained two Karnataka cricketers

బళ్లారి టస్కర్స్, హుబ్బళ్ళి టైగర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ లో క్రికెట్ బెట్టింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి బెళగావి ఫ్యాంథర్స్ టీం యజమాని అష్వఖ్ ఆలీ తార్, బళ్లారి టస్కర్స్ టీం డ్రమ్మర్ భవేష్, బెంగళూరు బ్లాస్టర్స్ టీం బౌలింగ్ కోచ్ విను ప్రసాద్, బ్యాట్స్ మెన్ విశ్వనాథన్ ను సీసీబీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బళ్లారి టస్కర్స్, హుబ్బళ్ళి టైగర్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ లో క్రికెట్ బెట్టింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి సీసీబీ పోలీసులు కేసు విచారణ ముమ్మరం చేశారు. ఇదే కేసులో ఢిల్లీకి చెందిన ఇద్దరు బుక్కీలను అరెస్టు చెయ్యడానికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ బుక్కీలు జత్తిన్, సయ్యాం విదేశాల్లో తలదాచుకున్నారని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

English summary
Bengaluru: CCB police probing fixing case in Karnataka Premier League (KPL) match detained two cricketers of Ballari tuskers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X