వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ సాహసం: డిగ్గీ, గతంలో రాఖీసావంత్‌తో పోలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kudos to Arvind Kejriwal's bravery, by entering politics: Digvijay
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై సామాన్యులకు ఆసక్తి పెరిగిందన్నారు.

భారత ప్రజాస్వామ్యాన్ని కేజ్రీవాల్ మరింత పటిష్టం చేశారని కొనియాడారు. ఆయన సాహసాన్ని అభినందిస్తున్నానని, ఇకపై ఇతర నాయకులు, రాజకీయ పార్టీలు ఆ పంథాను అనుసరిస్తాయని ఆశిస్తున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. కేజ్రీవాల్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ఆయన పేర్కొన్నారు. నెల పదిహేను రోజుల క్రితం డిగ్గీనే కేజ్రీవాల్‌ను రాఖీసావంత్‌తో పోల్చారు.

కాగా, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 28 మంది సభ్యులున్న ఎఎపికి 8 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ బయటి నుంచి మద్దతివ్వనుంది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ని కలిసి కేజ్రీవాల్ లేఖ అందజేశారు. దీంతో నిన్నమొన్నటి వరకు సాధారణ అధికారిగా ఉన్న కేజ్రీవాల్ త్వరలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

అవినీతికి వ్యతిరేకంగా జనలోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహజారే ఉద్యమించిన దీక్షా వేదిక రామ్‌లీలా మైదాన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలో ఇదే తొలి మైనారిటీ ప్రభుత్వం కానుంది. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఏం జరుగుతుందో చూస్తామని కేస్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్రపతికి పంపి ఆయన నిర్ణయం తెలుసుకుంటానని కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు.

English summary
“Kudos to his (Arvind Kejriwal) bravery, by entering politics, he has strengthened democracy.” Digvijay Singh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X