కుల్ భూషణ్ జాదవ్ కేసులో రేపు భారత్, పాక్ వాదనలు.. డిసెంబర్ లో తుది తీర్పు
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో రేపు భారత్, పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించనున్నాయి.
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో రేపు భారత్, పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించనున్నాయి. గూఢచర్యం ఆరోపణలు మోపుతూ భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కి పాకిస్తాన్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లి ఆ మరణశిక్షపై భారత్ స్టే తెచ్చుకుంది. అయితే బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. రేపు ఆ న్యాయస్థానంలో పాకిస్తాన్, భారత్ తమ వాదనలు వినిపించనున్నాయి.

ఈ కేసులో ఇరు దేశాలు తాము చేస్తోన్న వాదనలపై ఆధారాలు సమర్పించాక వాటిని అంతర్జాతీయ న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అనంతరం ఈ కేసులో తుది తీర్పు ఈ ఏడాది డిసెంబరులో ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications