కుంభమేళా మళ్లీ ఎప్పుడో తెలుసా..? ఈ సారి ఎక్కడ..? ఎన్ని రోజులు..?
ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా ముగిసింది. జనవరి 13న మొదలైన మహా కుంభమేళా 45 రోజులపాటు సాగింది. మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో దాదాపు 70 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సుమారు 77 దేశాలకు చెందిన 120 మంది ప్రతినిధులతోపాటు మన ప్రధాని మోదీ, రాష్ట్రాల సీఎంలు, సెలబ్రిటీలు.. ఇలా ఎంతో మంది కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
అయితే కుంభమేళా మళ్లీ రెండేళ్లకే రానుంది. 2027లోనే కుంభమేళా వస్తుంది. అయితే 2027లో వచ్చే కుంభమేళా మహారాష్ట్ర నాసిక్ లో జరగనుంది. త్రయంభకేశ్వరానికి 40 కిలోమీటర్ల దూరంలోని నాసిక్ లో ఈ కుంభమేళా జరగబోతోంది. 2027న గోదావరి నదిలో కుంభమేళా నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. తాజా అంచనాల ప్రకారం.. 2027 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు.. 30 రోజుల పాటు ఈ కుంభమేళా జరగనుంది.

కుంభమేళాలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లోనే జరుగుతాయి. మూడేళ్లకు ఒకసారి.. ఒక్కోసారి ఒక్కో నగరంలో ఈ కుంభమేళా జరుగుతుంది. నాలుగేళ్లకు వచ్చే దాన్ని కుంభమేళా అంటారు. ఆరేళ్లకు వచ్చే దాన్ని అర్థ కుంభమేళా.. 12 ఏళ్లకు జరిగే దాన్ని పూర్ణ కుంభమేళా అంటారు. ఇక 144 ఏళ్లకు జరిగే దాన్ని మహా కుంభమేళా అంటారు.












Click it and Unblock the Notifications