అవమానించేలా తాకారు: శ్వేతామీనన్, యూత్‌కాంగ్ ఫైర్
తిరువనంతపురం: తన పట్ల కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యులు పీతాంబర కురుప్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి శ్వేతా మీనన్ ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కురుప్ వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పినందు వల్లే ఆమె తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అంతకుముందు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె తన ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారట.

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న అంశాల మేరకు... కొల్లాంలోని కార్యక్రమంలో ఎంపి తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను అవమానకరరీతిలో ముట్టుకున్నారని చెప్పారట. అయితే శ్వేతా మీనన్ తన ఫిర్యాదును ఆదివారం సాయంత్రం వెనక్కి తీసుకున్నారు.
కాగా, కురుప్ అంశం రాష్ట్ర కాంగ్రెసు పార్టీకి చిక్కులు తెచ్చింది. కురుప్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు శ్వేతా మీనన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని యూత్ కాంగ్రెసు మండిపడుతోంది.












Click it and Unblock the Notifications