తమిళ కాంగ్రెస్ నేతలపై.. రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన ఖుష్బూ
తాను కాంగ్రెస్ సభ్యురాలిని కాదంటూ విమర్శ లు చేసిన వారిపై సినీ నటి ఖుష్బూ ఢిల్లీలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.
చెన్నై: తాను కాంగ్రెస్ సభ్యురాలిని కాదంటూ విమర్శ లు చేసిన వారిపై సినీ నటి ఖుష్బూ ఢిల్లీలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. తొలుత డీఎంకేలో ఉన్న ఖుష్బూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, ఆమెను పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా నియమించారు. అయితే ఖుష్బూకు తమిళనాడు కాంగ్రెస్ నేతలు పెద్దగా సహకరించడం లేదు కదా, ఆమెపై సొంత పార్టీ వారే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఖుష్బూకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేదని దక్షిణ చెన్నై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరాటే త్యాగరాజన్ విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళిన ఆమె రాహుల్ గాంధీని కలిసి కరాటే త్యాగరాజన్‌తో పాటు పలువురు నేతల వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. రాహుల్‌తో భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల పరిణామాలపైనే చర్చించినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications