వణికిన లఢక్: భారీ భూకంపం: వరుస ప్రకంపనలతో
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఈ తెల్లవారు జామున 6:10 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది. లఢక్ రాజధాని లేహ్‌ను భూకంప కేంద్రంగా గుర్తించింది నేషనల్ సిస్మాలజీ సెంటర్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం లఢక్‌లో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల లఢక్ పర్యటన ఆదివారం ప్రారంభమైంది. లేహ్‌లో పలు సమీక్ష సమావేశాలు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. కొంతకాలంగా లఢక్‌లో వరుసగా భూప్రకంపనలు నమోదవుతోన్నాయి. వాటి తీవ్రత ఈ స్థాయిలో ఉండట్లేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో వారం రోజుల వ్యవధిలో రెండు భూకంపలు సంభవించాయి. గరిష్ఠంగా 5.4 తీవ్రతతో సంభవించిన గత ఏడాది సెప్టెంబర్ 25న భూమి కంపించింది. మరోసారి అదే స్థాయిలో తాజాగా భూకంపం నమోదైంది.
Earthquake of Magnitude:4.6, Occurred on 28-06-2021, 06:10:35 IST, Lat: 34.49 & Long: 78.43, Depth: 18 Km ,Location: 86km ENE of Leh, Laddakh, India for more information download the BhooKamp App https://t.co/fzJxpWMIbI pic.twitter.com/Py5bh23GSM
— National Center for Seismology (@NCS_Earthquake) June 28, 2021

తాజాగా సంభవించిన ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం ఎంత మేర ఉందనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో దాని తీవ్రత ఉండటం వల్ల కొండచరియలు విరిగి పడే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. రోడ్డు మార్గాలు మూసుకుపోవచ్చని అనుమానిస్తోన్నారు. అలాంటి మార్గాల మీదుగా రాకపోకలు సాగించే వారు అప్రమత్తంగా ఉండాలంటూ స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు రోజుల కిందటే ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందుకుష్ పర్వతాల్లో దాదాపుగా ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది.












Click it and Unblock the Notifications