Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: బూతు డైలాగులు, 15 వేల మంది ఫాలోవర్స్, రూ. 20 లక్షలు లాగేసిన స్నేహా, అసలు మ్యాటర్ తో షాక్ !

బెంగళూరు/బెళగావి: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో అందమైన యువతి ఫోటోలు చూసిన చాలా మంది యువకులు ఆమెకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించారు. చాలా మంది యువకుల ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఆమె ఓకే చేసింది. ఇలా ఆమెకు సోషల్ మీడియాలో కొన్ని వేల మంది స్నేహితులు అయ్యారు. ప్రతిరోజు కొందరు ఆమెతో చాటింగ్ చేస్తున్నారు. ఆ లేడీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి యువకులకు మేసేజ్ లు వస్తుండటంతో కొందరు జోల్లు కార్చుకున్నారు. బూతు డైలాగులతో ఉన్న మేసేజ్ లు రావడంతో కొందరు ఆమె వలలో పడిపోయారు. కొంతకాలం సోషల్ మీడియా లేడీ చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు చాలా మంది వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు నగదు బదిలి చెయ్యడం మొదలు పెట్టారు. ఇలాగే ఓ యువకుడు కూడా ఆ కిలాడీ లేడీ అడిగినంత డబ్బులు పంపించాడు. చివరికి పోలీసుల ఎంట్రీతో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

 అందమైన అమ్మాయి ఫోటోలు

అందమైన అమ్మాయి ఫోటోలు

కర్ణాటకలోని బెళగావిలో తాను నివాసం ఉంటున్నానని, తన పేరు స్నేహా అంటూ ఓ అమ్మాయి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో పలు అకౌంట్ లు ప్రారంభించింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో అందంగా ఉన్న స్నేహా అనే పేరుతో ఉన్న యువతి ఫోటోలు చూసిన చాలా మంది యువకులు ఆమెకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించారు.

జోల్లు కార్చుకున్న యువకులు

జోల్లు కార్చుకున్న యువకులు

చాలా మంది యువకుల ఫ్రెండ్ రిక్వెస్ట్ స్నేహా ఓకే చేసింది. ఇలా అందంగా ఉన్న స్నేహా సోషల్ మీడియాలో అకౌంట్ లో 15 వేల మందికి పైగా స్నేహితులు అయ్యారు. స్నేహా ఫేస్ బుక్ అకౌంట్ లో 15 వేల మందికి పైగా ఫోలోవర్సో ఉన్నారు. ప్రతిరోజు కొందరు స్నేహాతో చాటింగ్ చేస్తున్నారు. స్నేహా కూడా వారితో చాటింగ్ చేస్తోంది.

 బూతు మెసేజ్ లు.... రూ. లక్షల్లో నగదు బదిలి

బూతు మెసేజ్ లు.... రూ. లక్షల్లో నగదు బదిలి

స్నేహా సోషల్ మీడియా అకౌంట్ నుంచి కొన్ని వేల మంది యువకులకు మేసేజ్ లు వస్తుండటంతో కొందరు జోల్లు కార్చుకున్నారు. స్నేహా అకౌంట్ నుంచి బూతు డైలాగులతో ఉన్న మేసేజ్ లు రావడంతో కొందరు యువకులు ఆమె వలలో పడిపోయారు. కొంతకాలం సోషల్ మీడియా లేడీ స్నేహా చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు చాలా మంది వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు నగదు బదిలి చెయ్యడం మొదలు పెట్టారు.

 ఓ యువకుడికి దూలతీరిపోయింది

ఓ యువకుడికి దూలతీరిపోయింది

బెళగావిలో నివాసం ఉంటున్న ఓ యువకుడు కూడా స్నేహా చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు లక్షల రూపాయల డబ్బులు బదిలి చేశాడు. నేను నిన్ను నేరుగా కలుస్లానని, మనం కలిసి ఎంజాయ్ చేద్దామని మాయమాటలు చెప్పిన స్నేహా అతని నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. చివరికి స్నేహా అతని సోషల్ మీడియా అకౌంట్ లు బ్లాక్ చెయ్యడంతో అతను బిత్తరపోయాడు.

అమ్మాయి కాదు..... అబ్బాయి

అమ్మాయి కాదు..... అబ్బాయి

తనను స్నేహా అనే అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు బెళగావిలోని సీఇఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తియ్యడంతో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. స్నేహా పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ లు ప్రారంభించింది అమ్మాయి కాదు అబ్బాయి అని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

 రూ. 20 లక్షలు వసూలు

రూ. 20 లక్షలు వసూలు

బెళగావి జిల్లాలోని నిప్పాణి తాలుకాలోని సాయిహింగ్లంజ్ గ్రామంలో నివాసం ఉంటున్న మహంతేష్ అనే యువకుడు సోషల్ మీడియాలో అందమైన అమ్మాయి ఫోటో డౌన్ లోడ్ చేసి ఆమె పేరు స్నేహాగా మార్చి నకిలి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లు ప్రారంభించి యువకులు మోసం చేశాడని బెళగావి పోలీసులు అన్నారు.

 15 వేల మందికి కుచ్చుటోపి

15 వేల మందికి కుచ్చుటోపి

స్నేహా పేరుతో 15 వేల మంది ఫాలోవర్స్ ను సంపాధించిన మహంతేష్ ఇప్పటి వరకు యువకులను మోసం చేసి సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేశాడని వెలుగు చూసిందని, కేసు విచారణలో ఉందని బెళగావి సీఇఎస్ పోలీసులు తెలిపారు. మొత్తం మీద మహంతేష్ సోషల్ మీడియాలో ఇంకా ఎంతమందని మోసం చేశాడు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+