Lady: మసాజ్ పేరుతో బాత్ రూమ్ వరకు వెలుతోంది, క్లైమాక్స్ లో ఏం చేస్తోందంటే ?, షాక్ !
బెంగళూరు: ఇంటి పని చేసే ముసుగులో ఓ మహిళ ఇంటి యజమానులకు దగ్గర అవుతోంది. వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తులు నివాసం ఉంటున్న ఇంటిలోనే ఆమె పనికి చేరుతోంది. పనిలో చేరిన తరువాత ఆమె ఇంట్లో ఉన్న వృద్దులకు మసాజ్ చేసే ముసుగులో బాత్ రూమ్ వరకు వెలుతోంది. తరువాత చేతివాటం చూపిస్తున్న కిలాడీ లేడీ ఇల్లు లూటీ చేసి అక్కడి నుంచి చెక్కేస్తోంది. చోరీ చేసిన నగలు కిలాడీ లేడీ కదువ పెట్టిందని, కొన్ని నగలు విక్రయించి ఆంధ్రప్రదేశ్ లోని సొంత ఊరిలో పొలం తీసుకుని బోర్ వేయించి వ్యవసాయం చేయిస్తోందని బెంగళూరు పోలీసులు అంటున్నారు.

ఇంటి పని చేస్తానని ?
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం సమీపంలోని కదిరిలో అక్కింమణి అలియాస్ లక్ష్మీ అనే మహిళ నివాసం ఉంటున్నది. బెంగళూరు చేరుకున్న లక్ష్మీ శ్రీమంతులు, కోటీశ్వరుల ఇళ్లకు తిరిగి తాను ఇంటి పని చేస్తానని వారిని సంప్రధించింది. ఇంటి పనికి చేరుతున్న లక్ష్మీ తరువాత ఇంటి యజమానుల దగ్గర నమ్మకంగా ఉన్నట్లు నటించింది.

మసాజ్ చేస్తానని బాత్ రూమ్ వరకు ?
ఇంటి పని చేసే ముసుగులో లక్ష్మీ ఇంటి యజమానులకు దగ్గర అవుతోంది. వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తులు నివాసం ఉంటున్న ఇంటిలోనే లక్ష్మీ పనికి చేరుతోంది. పనిలో చేరిన తరువాత ఇంట్లో ఉన్న వృద్దులకు మసాజ్ చేసే ముసుగులో బాత్ రూమ్ వరకు వెలుతున్న లక్ష్మీ వారు స్నానం చేసి వచ్చేలోపు వారి ఇంటిలో ఉన్న బంగారు నగలు, నగదుతో పారిపోతోంది.

రూ. 13 లక్షల నగలు సీజ్
మారతహళ్లిలో ఇలాగే ఇంటిలో చోరీ చేసిన లక్ష్మీ తరువాత కదిరికి పారిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీని అరెస్టు చేశారు. లక్ష్మీ నుంచి పోలీసులు రూ. 13 లక్షల విలువైన 271 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు వస్తున్న లక్ష్మీ ఆమె అనుకున్న పని పూర్తి చేసిన తరువాత కళ్లీ కదిరికి చెక్కేస్తోందని పోలీసులు అన్నారు.

సొంతంగా పొలం తీసుకుని బోర్ వేసి వ్యవసాయం
కిలాడీ లేడీ లక్ష్మీ మారతహళ్ళి, మునేకోళ్లాలోని ఇస్రో లేఔట్ లో ఇటీవల నగలు చోరీ చేసిందని పోలీసులు అన్నారు. చోరీ చేసిన నగలు కదువ పెట్టిందని, కొన్ని నగలు విక్రయించి సొంత ఊరిలో పొలం తీసుకుని బోర్ వేయించి వ్యవసాయం చేయిస్తోందని పోలీసులు అన్నారు. మారతహళ్లితో పాటు కేఆర్ పురం, రాజాజీనగర్ లో లక్ష్మీ మీద ఇలాంటి కేసులు నమోదు అయ్యాయని మారతహళ్ళి పోలీసులు చెప్పారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications