Wife: భర్త ఆర్మీ ఆఫీసర్, సెలవుల్లో వస్తే భార్య ఆత్మహత్య, ఎవరు వాళ్లు ?, ఏం జరుగుతోంది ?, షాక్ !

చెన్నై/ వేలూరు/ చిత్తూరు: మిలటరీలో ఉద్యోగం చేస్తున్న యువకుడికి, పెద్దలు చూపించిన అమ్మాయితో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. వేరే రాష్ట్రంలో భర్త ఉద్యోగం చెయ్యడంతో కుమార్తెతో కలిసి భార్య సొంతఊర్లో ఉంటోంది. 20 రోజుల క్రితం సెలవుల మీద వచ్చిన మిలటరి ఉద్యోగికి కొన్ని విషయాలు తెలిశాయని సమాచారం. ఎవరు వాళ్లు, ఏం జరుగుతోంది, నేను లేని సమయంలో నువ్వు ఎక్కడెక్కడికి వెలుతున్నావ్ ? అంటూ గొడవపెట్టుకున్నాడు. ఛీ.. ఈ జీవితం అంటూ భార్య, కుమార్తెతో కలిసి రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ఆర్మీ మొగుడితో హ్యాపీ

ఆర్మీ మొగుడితో హ్యాపీ

తమిళనాడులోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సరిహద్దు)లోని విరింజిపురం గ్రామంలో రాజేష్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వేలూరు జిల్లాకు చెందిన జయంతి (29) అనే యువతితో రాజేష్ కుమార్ వివాహం జరిగింది. రాజేష్ కుమార్ మేఘాలయాలో ఆర్మీ అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు.

సొంతఊర్లో పెళ్లాం

సొంతఊర్లో పెళ్లాం

రాజేష్ కుమార్, జయంతి దంపతులకు నందితా (4) అనే కుమార్తె ఉంది. మేఘాలయాలో ఆర్మీ అధికారిగా ఉద్యోగం చేస్తున్న రాజేష్ కుమార్ భార్య జయంతి, కుమార్తె నందితాను సొంత ఊర్లో వదిలిపెట్టి వెళ్లాడు. సెలవులు చిక్కినప్పుడు మాత్రమే రాజేష్ కుమార్ సొంత ఊరికి వచ్చి భార్య జయంతి, కుమార్తె నందితాతో కలిసి ఉంటున్నాడు.

 సెలవుల్లో భర్త ఊరికి

సెలవుల్లో భర్త ఊరికి

20 రోజుల క్రితం సెలవులు తీసుకున్న ఆర్మీ అధికారి రాజేష్ కుమార్ మేఘాలయా నుంచి చాలా సంతోషంగా సొంతఊరికి వచ్చాడు. సెలవులపై వచ్చిన రాజేష్ కుమార్ భార్య జయంతి, కుమార్తె నందితాతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి హ్యాపీగా సొంత ఊరిలో, బంధువుల ఊరికి వెళ్లివస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఎవరు వాళ్లు ?, ఏం జరుగుతోంది

ఎవరు వాళ్లు ?, ఏం జరుగుతోంది

శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేష్ కుమార్ రాత్రి పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య జయంతితో రాజేష్ కుమార్ గొడవపెట్టుకున్నారు. నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు ?, నీకు ఫోన్లు చేస్తున్న వాళ్లు ఎవరు ? అంటూ ఏదేదో మాట్లాడటంతో గొడవ పెద్దది అయ్యింది. కుటుంబ సభ్యులు రాజేష్ కుమార్, జయంతి దంపతులకు సర్దిచెప్పడంతో ఆ రోజు రాత్రి ఇద్దరూ నిద్రపోయారని తెలిసింది.

భార్య, కూతురు ఆత్మహత్యతో షాక్

భార్య, కూతురు ఆత్మహత్యతో షాక్

ఆదివారం మళ్లీ రాజేష్ కుమార్, జయంతి దంపతుల మధ్య గొడవ జరిగింది. తరువాత సహనం కోల్పోయిన జయంతి కుమార్తె నందితాను పిలుచుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తరువాత జయంతి కుమార్తె నందితాను ఎత్తుకుని విజిపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడటంతో ఇద్దరు అక్కడిక్కడే నుజ్జునుజ్జు కావడంతో వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 సెలవుల్లో షాక్ మీద షాక్

సెలవుల్లో షాక్ మీద షాక్

విషయం తెలుసుకున్న రాజేష్ కుమార్, అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు. జయంతి కుమార్తెతో కలిసి ఎందుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందో కచ్చితంగా తెలియడం లేదని, రాజేష్ కుమార్ ను విచారణ చేస్తున్నామని వేలూరు జిల్లా పోలీసులు తెలిపారు. సెలవుల మీద వచ్చిన రాజేష్ కుమార్ భార్య, కుమార్తె అంత్యక్రియల్లో పాల్గొనడంతో స్థానికులు చలించిపోయారు. సెలవుల్లో వచ్చిన ఆర్మీ ఆఫీసర్ కు ఊహించని షాక్ ఎదురైయ్యిందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+