Lady: మంచం మీద పసిబిడ్డ మాయం, బిడ్డపుట్టిన టైమ్ బాగాలేదని జోస్యం, కన్నతల్లి ఏం చేసిందంటే, క్లైమాక్స్ !

చెన్నై/మదురై: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. నాలుగు నెలల క్రితమే ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. స్పిన్నింగ్ మిల్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని భార్య, బిడ్డలను సంతోషంగా చూసుకుంటున్నాడు. భార్య ఇంటి దగ్గరే ఉంటున్నది. రెండు రోజుల క్రితం ఇంట్లో మంచం మీద ఉన్న నాలుగు నెలల పసిబిడ్డ కనపడకుండా పోయాడు. బిడ్డ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు, పోలీసులు గాలించారు. ఊరి సమీపంలోని నది సమీపంలోని పొదల్లో కనపడకుండా పోయిన నాలుగు నెలల బిడ్డ శవమై కనిపించడం కలకలం రేపింది. బిడ్డను మాయం చేసి చంపేసిన కేసులో పోలీసులు బాలుడి తల్లిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

 కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి

కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి

తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పళని సమీపంలోని నరసాపురంలో నివాసం ఉంటున్న మహేశ్వరన్ అనే యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. లతా అనే యువతిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెతో మహేశ్వరన్ వివాహం జరిపించారు.

 హ్యాపీగా ఉంటున్న దంపతులు

హ్యాపీగా ఉంటున్న దంపతులు

కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న మహేశ్వరన్, లతా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. మహేశ్వరన్, లతా దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు. నాలుగు నెలల క్రితమే ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. స్పిన్నింగ్ మిల్ లో ఉద్యోగం చేస్తున్న మహేశ్వరన్ అతని భార్య లతా, ఇద్దరు బిడ్డలను సంతోషంగా చూసుకుంటున్నాడు. మహేశ్వరన్ బార్య లతా ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలను చూసుకుంటున్నది.

 మంచం మీద మాయం అయిన చిన్నారి

మంచం మీద మాయం అయిన చిన్నారి

రెండు రోజుల క్రితం మహేశ్వరన్ ఉద్యోగానికి వెళ్లాడు. అదే రోజు ఇంట్లో మంచం మీద ఉన్న లతా నాలుగు నెలల పసిబిడ్డ కనపడకుండా పోయాడు. బిడ్డ కోసం కుటుంబ సభ్యులు మహేశ్వరన్, లతా దంపతులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు గాలించారు. బిడ్డ కనపడకపోవడంతో మహేశ్వరన్ పళని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 బిడ్డను చంపేసిన కసాయి తల్లి

బిడ్డను చంపేసిన కసాయి తల్లి

బిడ్డ కోసం పళని పోలీసులు గాలించారు. పళని సమీపంలోని నది సమీపంలోని పొదల్లో కనపడకుండా పోయిన నాలుగు నెలల బిడ్డ శవమై కనిపించడం కలకలం రేపింది. బిడ్డను మాయం చేసి చంపేసిన కేసులో పోలీసులు బాలుడి తల్లి లతాను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. రెండో కొడుకు పుట్టినప్పటి నుంచి తాను అనారోగ్యానికి గురౌతున్నానని, జాతకం చూసిన జ్యోతిష్యులు బిడ్డ పుట్టిన టైమ్ బాగాలేదని చెప్పారని, బిడ్డను చంపేస్తే నీకు టైమ్ కలిసి వస్తుందని చెప్పారని, అందుకే బిడ్డను చంపేశానని లతా అంగీకరించిందని పళని పోలీసులు అన్నారు. పుట్టిన బిడ్డ టైమ్ బాగాలేదని నాలుగు నెలల కన్న కొడుకును లతా హత్య చెయ్యడం పళనిలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+