ఆపదలో ఉన్న వారికి అమ్మగా : 15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు : షీలా దీక్షిత్..సుష్మా స్వరాజ్..!
Recommended Video
కేవలం 15 రోజుల సమయంలోనే ఇద్దరు ఢిల్లీ మాజీ మహిళా ముఖ్యమంత్రులు కన్నుమూసారు. ఇద్దరు డిల్లీలోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ క్రియా శీలకంగా ఉండేవారు. కాంగ్రెస్‌లో షీలా దీక్షిత్.. బీజేపీలో సుష్మా స్వరాజ్ పార్టీ అధినాయ కత్వానికి అత్యంత విధేయులు..ఇష్టులు. ఢిల్లీకి సుష్మా స్వరాజ్ అయిదో ముఖ్యమంత్రిగా పని చేయగా.. ఆ వెంటనే షీలా దీక్షిత్ ఆరో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆపదలో ఉన్న వారిని ఆదరించే అమ్మగా సుష్మకు పే రుంది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ శ్రేణులు మొత్తం ఆర్టికల్ 370 రద్దు సంబరాల్లో ఉండగా..సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతి పార్టీ శ్రేణులను విషాదం నింపింది.
పక్షం రోజుల తేడాల్లో ఇద్దరు మహిళా నేతలు..
ఇద్దరు రెండు జాతీయ పార్టీల్లో అంచెలంచలుగా ఎదిగిన కీలక నేతలు. ఇద్దరూ గుండెపోటుతో ఆకస్మికంగా దూరం అయ్యారు. ఈ ఇద్దరూ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పని చేసారు. జులై 20వ తేదీన గుండెపోటుతో షీలాదీక్షిత్ తుదిశ్వాస విడువగా, సరిగ్గా పక్షం రోజులకు మరో మహిళా నేత సుష్మాస్వరాజ్ అదే తరహాలో కన్నుమూశారు. షీలా దీక్షిత్ దిల్లీ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందగా, ఆమె కంటే ముందు ఆ పదవిని అధిష్ఠించిన సుష్మా స్వరాజ్ జాతీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు. దిల్లీ అయిదో ముఖ్యమంత్రిగా సుష్మాస్వరాజ్ పనిచేయగా, ఆరో ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ సేవలందించారు. అమె షీలాదీక్షిత్ కంటే 14 ఏళ్లు చిన్న. 1998లో దిల్లీ ఎన్నికలకు 40 రోజుల ముందు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె అకస్మాత్తుగా పెరిగిన ఉల్లిగడ్డల ధర కారణంగా ఓటమి చవిచూశారు. వాటి ధరలను తగ్గించడానికి చౌకధరల దుకాణాలు ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకపోయింది. కేజీ రూ.40 నుంచి రూ.50వరకు పలికిన ధరల కారణంగా ఆమె అధికారం కోల్పోయారు.

ఆపదలో ఉన్న వారికి అమ్మగా సుష్మ
విద్యార్ధి నేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సుష్మా స్వరాజ్ నరనరాన జాతీయ భావంతో బీజేపీలో కీలక నేతగా ఎది గారు. పార్టీ అగ్రనేతలు దవంగత వాజ్‌పేయి..అడ్వాణీ..నేటి ప్రధాని మోదీకి అత్యంత ఇష్టురాలు సుష్మా స్వరాజ్. ఆమె సమర్ధతకు గుర్తింపుగా మోదీ తన తొలి ప్రభుత్వంలో విదేశాంగ శాఖ అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఏ కష్టంలో ఉన్నా ఒక్క ట్వీట్ చేస్తే చాలు స్పందించి వారిని కష్టాల నుంచి గట్టెక్కించారు. వీసా రాక ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలకు వీసాలు ఇప్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్థాన్‌లో ఓ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మూగబాలిక గీతను భారత్‌కు రప్పించి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కనిపెట్టేందుకు ప్రత్యేకశ్రద్ధ చూపారు. 2017లో పాకిస్థాన్ నుంచి ఆ అమ్మాయిని భారత్‌కు రప్పించి అమ్మలా ఆదిరస్తారనే నమ్మకం సుష్మా మీద ఉండేది.












Click it and Unblock the Notifications