బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady doctor: ప్రభుత్వ ఉద్యోగం.... మేడమ్ ప్రైవేటు ధరిద్రం, ఫ్రెండ్ ఇంట్లో ఏం చేసిందేంటే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి నుంచి మా ప్రాణాలు కాపాడండి డాక్టర్ అంటూ పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ సక్రమంగా సాగాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి చేస్తున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ సక్రమంగా సాగాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొందరు ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ వెయ్యకుండా వాటిని బయట క్లీనిక్ లకు తీసుకెళ్లి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని వాటిని బ్లాక్ లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న లేడీ డాక్టర్ వ్యాక్సిన్ లను బ్లాక్ మార్కెట్ లో ప్రజలకు వేసి లస్క్ టపా అంటూ డబ్బులు బ్యాగ్ లో వేసుకుంటూ అడ్డంగా బుకైపోయింది. ఓ ప్రభుత్వ లేడీ డాక్టర్ స్నేహితురాలి ఇంట్లో ఏకంగా వ్యాపారం పెట్టేయడం కలకలం రేపింది.

Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?Illegal affair: భార్య నాటుకోడి, ప్రియుడు పందెంకోడి, పులుసు పెట్టిన భర్త, పెళైన మూడో రోజు ?

 ప్రభుత్వ ఆసుపత్రిలో లేడీ డాక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిలో లేడీ డాక్టర్

ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం చేస్తోంది. బెంగళూరులో కోవిడ్ పాజిటివ్ కేసులు అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర సమీపంలోని మంజునాథ నగర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ ఆసుపత్రి)లో డాక్టర్ పుష్పిత లేడీ డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు.

 ఫ్రెండ్ ప్రేమాతో స్కెచ్

ఫ్రెండ్ ప్రేమాతో స్కెచ్

అన్నపూర్ణేశ్వరి నగర్ లో డాక్టర్ పుష్పిత స్నేహితురాలు ప్రేమా నివాసం ఉంటున్నది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వెయ్యాలని బీబీఎంపీ అధికారులు వ్యాక్సిన్ లు సరఫరా చేశారు. అయితే అక్కడ పని చేస్తున్న డాక్టర్ పుష్పిత పేద ప్రజల పేర్లు, వివరాలు నమోదు చేసుకుని వారికి వ్యాక్సిన్ వెయ్యకుండా ఆ వ్యాక్సిన్ లు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని అన్నపూర్ణేశ్వరినగర్ లో నివాసం ఉంటున్న స్నేహితురాలు ప్రేమాకు ఇచ్చింది.

 ప్రజలకు ప్రాణం మీద ఆశ

ప్రజలకు ప్రాణం మీద ఆశ

ప్రభుత్వం సరఫరా చేస్తున్న కరోనా వ్యాక్సిన్ లను లేడీ డాక్టర్ పుష్పిత స్వాహా చేసింది. తరువాత ప్రేమా ఇంట్లో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు ఒక్కొ వ్యాక్సిన్ రూ. 500 లు తీసుకుని ఆ వ్యాక్సిన్ లు బ్లాక్ లో విక్రయించింది. ప్రాణం మీద ఆశతో స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్లు ప్రేమా ఇంటికి వెళ్లి ఆమె స్నేహితురాలు డాక్టర్ పుష్పిత చేతుల మీదుగా వ్యాక్సిన్ వేసుకుని వాళ్లకు రూ. 500 సమర్పించుకుంటున్నారు.

 దూలతీరిపోయింది

దూలతీరిపోయింది

ప్రేమా ఇంటిలో బ్లాక్ లో వ్యాక్సిన్ విక్రయిస్తున్నారని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీసీపీ సంజీవ్ పాటిల్, ఇన్స్ పెక్టర్ లోహిత్ తదితరులు సామాన్య ప్రజలులాగా మామూలు దస్తులు వేసుకుని వ్యాక్సిన్ వెయ్యాలని ప్రేమా ఇంటికి వెళ్లారు. సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వ్యాక్సిన్ లు బ్యాగ్ లో వేసుకుని డాక్టర్ పుష్పిత అక్కడికి చేరుకునింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వేసే వ్యాక్సిన్ లను రూ. 500 తీసుకుని పోలీసులకు వ్యాక్సిన్ వెయ్యడానికి ప్రయత్నించిన డాక్టర్ పుష్పితను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు.

 ప్రభుత్వం జీతం...... ప్రైవేటు లాభం

ప్రభుత్వం జీతం...... ప్రైవేటు లాభం

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ కు సహకరించిన ఆమె స్నేహితురాలు ప్రేమాను కూడా అరెస్టు చేశామని డీసీపీ సందీప్ పాటిల్ మీడియాకు చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వెయ్యాల్సిన వ్యాక్సిన్ లను డాక్టర్ పుష్పిత బ్లాక్ లో విక్రయించి భారీ మొత్తంలో డబ్బులు సంపాధించి సామన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడిందని, ప్రభుత్వాన్ని మోసం చేసిందని కేసులు నమోదు చేశామని, ఇద్దర్నీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.

English summary
Lady doctor: Bengaluru Annapurneshwari Nagar police have arrested two persons along with a doctor who was vaccinating people and taking Rs 500.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X