ప్రేమోన్మాది ఘాతుకం: ప్రేమించలేదని యువతి గొంతుకోసి చంపాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదనే అక్కసుతో ఓ ప్రేమోన్మాది విధ్యార్థిని నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకొంది.తమిళనాడులోని రామనాథపురం జిల్లా తిరువాడానై సమీపంలోని అడుత్హకుడ గ్రామానికి చెందిన పళనిస్వామి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.

అతని భార్య మహేశ్వరి, కుమార్తె ధరణి గ్రామంలో ఉంటున్నారు. శివగంగై జిల్లా మహిళా కాలేజీలో ధరణి బీఎ ఫస్టియర్ చదువుతోంది. వీరి ఇంటి పక్కనే నివసించే బంధువు సేతురామన్ కుమారుడు కుమార్ చెన్నైలో లెదర్ సంచులు కుడుతూ జీనవం సాగించేవాడు.

lady killed by man rejected his love

కొంతకాలంగా ధరణిపై ప్రేమ పెంచుకొన్న కుమార్ తరచూ గ్రామానికి వచ్చి వెళ్ళేవాడు. ఆరు నెలల క్రితం తన బంధువులతో కలిసి ధరణి ఇంటికి వెళ్ళి పెళ్ళి చేయాలని కోరారు.దీనికి ధరణి తల్లిదండ్రులు నిరాకరించారు.

ఆ తర్వాత ధరణి వెంట పడేవాడు. పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు,. వేదించేవాడు,. దీంతో రెండు కుటుంబాల మద్య ఘర్షణ చోటుచేసుకొంది. ధరణి తల్లి అన్న కలిసి కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉంటే ధరణి తల్లి మహేశ్వరి, అన్ని ధర్మలింగం ఆదివారం నాడు ఊరికి వెళ్ళారు,. కాలేజీకి సెలవు కావడంతో పెరటి తలుపులు తెరి ఉంచి ధరణి ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. ఈ విషయాన్ని తెలుసుకొన్న కుమార్ ఇంట్లోకి చొరబడి తలుపులకు లోపలి నుండి తాళం వేశాడు.

అనంతరం టీవీ ఆన్ చేసి సౌండ్ పెంచాడు. ఇంతలో ధరణికి వెలుకవ వచ్చింది. కుమార్ తన వెంట తెచ్చుకొన్న వేట కొడవలితో విచక్షణ రహితంగా ఆమె గొంతు నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
lady killed by man in tamilnadu on sunday. kumar murdered dharani for rejected his love. police registered a case.
Please Wait while comments are loading...