Lady techie: వీకెండ్, అర్దరాత్రి మందు పార్టీలు, లాంగ్ డైవ్ కు వెళ్లిన లేడీ టెక్కీ తిరిగిరాలేదు!

చెన్నై: ఉద్యోగాలు చేస్తున్న యువతి, యువకులు స్నేహితులతో కలసి అద్దె ఇండ్లు, అపార్ట్ మెంట్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొందరు పీజీల్లో ఉంటున్నారు. వీకెండ్ సమయంలో స్నేహితులు సరదాగా గడుపుతుంటారు. కొందరు యువతి, యువకులు జాలీగా లాంగ్ డ్రైవ్ వెలుతుంటారు.

అయితే జాలీ రైడ్ కు బయలుదేరే ముందే మద్యం సేవించడం, ఇష్టం వచ్చినట్లు కార్లు, బైక్ లు నడపడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బాయ్ ఫ్రెండ్ తో కలిసి మద్యం సేవించి లాంగ్ డ్రైవ్ వెళ్లిన లేడీ టెక్కీ తరువాత తిరిగిరాకపోవడంతో అందరూ షాక్ అయ్యారు.

చెన్నైలో లేడీ టెక్కీ

చెన్నైలో లేడీ టెక్కీ

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాకు చెందిన గాయత్రి (26 అనే యువతి) చెన్నై చేరుకుని పల్లికరణై ప్రాంతంలోని ఓ పీజీలో నివాసం ఉంటూ దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తోంది. తమిళనాడులోని ఉలుందూరుపేటకు చెందిన 29 ఏళ్ల అశ్విన్ అనే యువకుడు చెన్నైలోని పల్లికరణై ప్రాంతంలో తన స్నేహితులతో కలసిఉంటూ ఇంటి నుంచి ఐటీ కంపెనీకి వర్క్ ఫ్రమ్ హోమ్ లో పనిచేస్తున్నాడు.

చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్న ఫ్రెండ్స్

చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్న ఫ్రెండ్స్

ఉలుందూరుపేటకు చెందిన 28 ఏళ్ల దినేష్ కుమార్ చోజింగనల్లూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అశ్విన్, దినేష్ కుమార్ స్నేహితులు, తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాకు చెందిన 25 ఏళ్ల రఘురామ్ బోరూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అశ్విన్, రఘురామ్, దినేష్ కుమార్ ఫ్రెండ్స్. రఘురామ్, గాయత్రి తేన్ కాశీ జిల్లాకు చెందిన వారు కావడంతో వాళ్లు స్నేహితులు అయ్యారు.

వీకెండ్.... కారులో లాంగ్ డ్రైవ్

వీకెండ్.... కారులో లాంగ్ డ్రైవ్

రఘురామ్, గాయత్రి, రఘురామ్ స్నేహితులు దినేష్ కుమార్, అశ్విన్ రాత్రి కలిశారు. తరువాత మద్యం సేవించిన నలుగురు అశ్విన్ కారులో కోవెలం ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చాలా సమయం ఉండి మద్యం సేవించారని తెలిసింది. అర్ధరాత్రి కోవలం నుంచి వండలూర్ ప్రధాన రహదారి మీదుగా హోండా సిటీ కారులో మంబాక్కం-మేదవాక్కం హైవేలో పల్లికరనై వద్ద ఉన్న హాస్టల్‌కు చేరుకున్నారు. అశ్విన్ కారు నడుపుతుండగా మధురపాక్కం ప్రాంతంలో రోడ్డుపై ఉన్న బ్యారీకేడ్ ను కారు ఢీకొట్టింది.

కారు పల్టీకొట్టి లేడీ టెక్కీ ప్రాణం పోయింది

కారు పల్టీకొట్టి లేడీ టెక్కీ ప్రాణం పోయింది

అశ్విన్ కారు బోల్తా పడడంతో కారులో ఉన్న నలుగురు అందులోనే ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పోలీసులు అంబులెన్స్ తో ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన గాయత్రి, అశ్విన్, రఘురామ్, దినేష్ కుమార్‌లను రక్షించారు. అయితే గాయత్రి అప్పటికే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని అంబులెన్స్‌లో క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫ్రెండ్స్ తో మద్యం సేవించి కారు డ్రైవింగ్

ఫ్రెండ్స్ తో మద్యం సేవించి కారు డ్రైవింగ్

కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అశ్విన్, రఘురామ్, దినేష్ కుమార్ లను విచారించారు. అలాగే కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. గత వారం కూడా ఇలాంటి ఘటనలో ఓ మహిళా ఐటీ ఉద్యోగి మరణించింది. స్నేహితులు తరచూ మద్యం సేవించడం, రాత్రిపూట లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లడంతో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోతున్నాయని చెన్నై సిటీ పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+