
Lady techie: బాయ్ ఫ్రెండ్ తో లేడీ టెక్కీ జాలీరైడ్, కిడ్నాప్ చేసి 10 మంది గ్యాంగ్ రేప్ !
రాంచీ/జార్ఖండ్: బాగా చదువుకున్న అమ్మాయి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కరోనా వైరస్ దెబ్బతో లేడీ టెక్కీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవాశం కల్పించారు. అప్పటి నుంచి ఆ లేడీ టెక్కీ ఆమె సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నది. ఉద్యోగం చేస్తున్న లేడీ టెక్కీని కలవడానికి ఆమె బాయ్ ఫ్రెండ్ వెళ్లాడు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ టెక్కీ బైక్ లో బయలుదేరింది. మార్గం మద్యలో లేడీ టెక్కీని కిడ్నాప్ చేసిన 10 మంది ఆమె మీద సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది. తన మీద ఎవరు సామూహిక అత్యాచారం చేశారు అనే విషయంలో బాధితురాలు సమాచారం ఇచ్చిందని పోలీసులు అంటున్నారు.
Wife: ఉద్యోగానికి వెళ్లిన ఫస్ట్ భార్య, ఇంట్లో శవమై కనిపించిన భర్త, రెండో భార్య !

వర్క్ ఫ్రమ్ హోమ్
జార్ఖండ్ లోని సాయిపాషా ప్రాంతంలో 26 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. బాగా చదువుకున్న ఆ అమ్మాయి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. కరోనా వైరస్ దెబ్బతో లేడీ టెక్కీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవాశం కల్పించారు. అప్పటి నుంచి ఆ లేడీ టెక్కీ ఆమె సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నది.

బాయ్ ఫ్రెండ్ తో జాలీగా వెళ్లింది
లేడీ టెక్కీకి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఉద్యోగం చెయ్యడానికి కంపెనీకి వెలుతున్న సమయంలో లేడీ టెక్కీ ఆమె బాయ్ ఫ్రెండ్ ను కలిసేది. ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేస్తున్న లేడీ టెక్కీని కలవడానికి ఆమె బాయ్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఆమె నివాసం ఉంటున్న గ్రామం దగ్గరకు వెళ్లి వస్తున్నాడు.

లెడీ టెక్కీ బాయ్ ఫ్రెండ్ ను చితకబాదేశారు
ఉద్యోగం చేస్తున్న లేడీ టెక్కీని కలవడానికి ఆమె బాయ్ ఫ్రెండ్ గత నెల 20వ తేదీన వెళ్లాడు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేడీ టెక్కీ బైక్ లో బయలుదేరింది. మార్గం మద్యలో లేడీ టెక్కీని కొంత మంది యువకులు వెంబడించారు. తరువాత లేడీ టెక్కీ వెలుతున్న బైక్ అడ్డగించారు. లేడీ టెక్కీ బాయ్ ఫ్రెండ్ ను అందరూ కలిసి చితకబాదేశారు.

లేడీ టెక్కీ మీద 10 మంది గ్యాంగ్ రేప్
లేడీ టెక్కీ బాయ్ ఫ్రెండ్ ను చితకబాది ఆమెను కిడ్నాప్ చేసిన 10 మంది కామాంధులు ఆమెను నిర్జనప్రదేశంలోకి ఎత్తుకుని వెళ్లి ఆమె మీద సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది. లేడీ టెక్కీ మీద సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

పక్కగ్రామంలోని కామాంధులే
బాధితురాలిని ఆమె బాయ్ ఫ్రెండ్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన గ్రామం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో నివాసం ఉంటున్న యువకులే తన మీద సామూహిక అత్యాచారం చేశారని లేడీ టెక్కీ సమాచారం ఇచ్చిందని, కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.