Lady: బ్యూటీ సెలూన్ ప్రభు హత్య కేసులో ట్విస్ట్, కవిత, బాయ్ ఫ్రెండ్ అండ్ కో అందర్, మ్యాటర్ ? !
కోయంబత్తూర్/ చెన్నై: బ్యూటీ సెలూన్ కు అమ్మాయిలు, మహిళలకు వెళ్లి వస్తున్నారు. బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు మహిళలతో చనువుగా ఉంటున్నాడు. రోడ్డు పక్కన ఓ యువకుడి చెయ్యి మాత్రమే చిక్కడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బ్యూటీ సెలూన్ లో పని చేసే వ్యక్తి కనపడటం లేదని కేసు నమోదు అయ్యిందని పోలీసులకు తెలిసింది. ఇదే సందర్బంలో తల లేని ముక్కలు ముక్కలు అయిన యువకుడి మొండెం, కాళ్లు, ఒక చెయ్యి బావిలో చిక్కాయి. బ్యూటీ సెలూన్ లో పని చేసే యువకుడే దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూసింది. బ్యూటీ సెలూన్ యువకుడిని హత్య చేసి అతని శవాన్ని 12 ముక్కలు చేసి అనేక ప్రాంతాల్లో విసిరేసిన ఓ లేడీతో సహ ముగ్గురు పోలీసులకు చిక్కిపోయారు.

మహిళలతో చనువుగా ఉన్నాడు
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని ఓ ప్రముఖ బ్యూటీ సెలూన్ లో ఈరోడ్ కు చెందిన ప్రభు ఉద్యోగంలో చేరాడు. ఈరోడ్ నుంచి కోయంబత్తూరు వచ్చి బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేస్తున్న ప్రభు బ్యూటీ సెలూన్ కు వచ్చి వెలుతున్న కొందరు అమ్మాయిలు, మహిళలతో చనువుగా ఉంటున్నాడు.

హత్యకు గురైన బ్యూటీ పార్లల్ ఉద్యోగి
కోయంబత్తూరు సిటీ సమీపంలోని దుడియలూరులోని వెల్లకినారు ప్రాంతంలో ఓ యువకుడి చెయ్యి మాత్రమే చిక్కడం కలకలం రేపింది. పోలీసుల విచారణలో బ్యూటీ సెలూన్ లో పని చేసే ప్రభు హత్యకు గురైనాడని వెలుగు చూసింది. మరుసటి రోజు ప్రభు తల లేని ముక్కలు ముక్కలు అయిన మొండెం, కాళ్లు, ఒక చెయ్యి బావిలో చిక్కాయి.

అక్రమ సంబంధం
బ్యూటీ సెలూన్ లో పని చేసే ప్రభు దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూడటం కోయంబత్తూరులో కలకలం రేపింది. బ్యూటీ సెలూన్ కు వెళ్లి వస్తున్న కొందరు యువతులు, అమ్మాయిలతో ప్రభు చాలా చనువుగా ఉంటున్నాడని, ఇద్దరితో అతనికి అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

లేడీతో సహ ముగ్గురి అరెస్టు
అక్రమ సంబంధం కారణంగానే ప్రభును దారుణంగా హత్య చేసి అతని శరీర అవయవాలు అక్కడక్కడా విసిరేశారని పోలీసులు అన్నారు. బ్యూటీ సెలూన్ ఉద్యోగి ప్రభు హత్య కేసులో కవిత, ఆమె బాయ్ ఫ్రెండ్ అమూల్ దివాకర్, కార్తీక్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని కోయంబత్తూరు పోలీసులు చెప్పారు.

12 ముక్కలు చేసి విసిరేశారు
గతంలో కవిత, ప్రభు చాలా చనువుగా ఉన్నారని, ఇదే విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ అమూల్ దివాకర్ కక్ష పెంచుకున్నారని, ఇదే విషయంలో ప్రభును పక్కాప్లాన్ తో హత్య చేశారని పోలీసులు అన్నారు. ప్రభు శవాన్ని 12 ముక్కలు చేసి ముగ్గురు నాలుగు నాలుగు ముక్కలు తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ విసిరేశారని పోలీసులు అన్నారు. నిందితులు ముగ్గురిని కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications