Lady: నా ఫ్యామిలీ నాశనం కావడానికి ఆమె కారణం, క్షుద్రపూజలు, చేతబడి, మహిళను నరికి చంపేసి రిలాక్స్!
ఒడిశా: గిరిజనలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతంలో కొన్ని కుటుంబాలకు మూడనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో ఓ మహిళ ఎప్పుడూ మంత్రాలు, తంత్రాలు అంటూ తిరుగుతోంది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. మా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి కారణం ఆమె చేతబడి చేస్తోందని ఆ కుటుంబ పెద్ద అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో మహిళకు అతనికి గొడవలు జరిగాయి. మా కుటుంబ సభ్యుల మీద ఆమె చేతబడి చేసిందని రగలిపోయిన వ్యక్తి ఆమెను దారుణంగా నరికి చంపేశాడు.

పూజలు, మంత్రాలు అని తిరుగుతున్న మహిళ
ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని బ్లాకన్ జామ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒదమల్లియా గ్రామంలో గంగి జముదా అలియాస్ గంగి అనే మహిళ నివాసం ఉంటున్నది. గంగి అనే మహిళ ఎప్పుడూ మంత్రాలు, తంత్రాలు అంటూ ఊరు ఊరు తిరుగుతోంది. గంగి చేతబడి చేస్తోందని ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కొందరికి అనుమానం ఉంది.

క్షుద్రపూజలు, చేతబడి అని రగిలిపోయాడు
గంగి నివాసం ఉంటున్న గ్రామంలో నివాసం ఉంటున్న మదన్ హింగువా అలియాస్ మదన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొంతకాలం నుంచి మదన్, అతని కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. మా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి కారణం గంగి చేతబడి చేస్తోందని మదన్ అనుమానం పెంచుకున్నాడు.

మహిళను నరికి చంపేశాడు
గంగి చేతబడి చేస్తోందని మదన్ రానురాను విపరీతంగా పెంచుకున్నాడు. ఇదే విషయంలో గిరజన మహిళ గంగీకి, మదన్ కు చాలాసార్లు గొడవలు జరిగాయి. మా కుటుంబ సభ్యుల మీద గంగీ చేతబడి చేసిందని రగలిపోయిన మదన్ కొడవలితో ఆమెను దారుణంగా నరికి చంపేశాడు. గంగిని హత్య చేసిన మదన్ ఏమీ తెలీనట్లు నాటకాలు ఆడాడు.

క్షుద్రపూజలు అని డౌట్
గంగీ అనే మహిళ హత్య కేసులో మదన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఇన్స్ పెక్టర్ కమలాకాంత్ దాస్ స్థానిక మీడియాకు చెప్పారు. గిరిజనలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతంలో కొన్ని కుటుంబాలకు మూడనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇదే విషయంలో గంగీని మదన్ హత్య చేశాడని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications