Lady: ఫస్ట్ సీక్రేట్, నెక్ట్స్ పబ్లిక్, ప్రియుడిని పార్టీకి పిలిచి లేపేసిన ప్రియురాలి ఫ్యాన్స్, ఫ్రెండ్స్ అంటే

జైపూర్/ రాజస్థాన్: మహిళతో కలిసి ఓ యువకుడు తిరగడం మొదలు పెట్టాడు. మొదట సీక్రేట్ గా ఇద్దరూ కలిసిమెలసి తిరిగారు. రానురాను ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా వారు తిరిగేశారు. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయిన వారి ప్రేమాయణం తరువాత వారి అసలు కథ అందరికి తెలిసిపోయింది. మహిళ బంధువులు చాలామంది ప్రియుడికి పరిచయం ఉన్నారు. ఫ్రెండ్స్ ద్వారానే ఆమెను అతను వలలో వేసుకున్నాడని తెలిసింది. మహిళతో నువ్వు తిరగకూడదని, నువ్వు పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రియుడు మాత్రం ఎవ్వరిని లెక్కచెయ్యలేదని తెలిసింది. బర్త్ డే పార్టీ ఉందని ప్రియుడికి అతని ఫ్రెండ్స్ ఫోన్ చేసి పిలిచారు. మందు పార్టీ చేసుకుందామని రాత్రి ఆ యువకుడు ఫ్రెండ్స్ చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. అంతే అతని కోసమే వేచి చూస్తున్న కొందరు వ్యక్తులు అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. ప్రియుడు చచ్చాడని రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయారు. బాధితుడు కేకలు వేస్తున్న విషయం గుర్తించిన కొందరు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై ప్రియుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పార్టీ ఉందని పిలిపించి పక్కాప్లాన్ తో అతని ఫ్రెండ్ హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

 మహిళతో లవ్

మహిళతో లవ్


రాజస్థాన్ లోని బార్మార్ సమీపంలోని రాణాసర్ గ్రామంలో వాసల్ ఖాన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వాసల్ ఖాన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓ మహిళ నివాసం ఉంటున్నది. మహిళతో పరిచయం పెంచుకున్న వాసల్ ఆమెను లొంగదీసుకున్నాడని తెలిసింది. వాసల్ తో కూడా ఆమె చనువుగా మాట్లాడుతోందని తెలిసింది.

మొదట సీక్రేట్..... తరువాత పబ్లిక్

మొదట సీక్రేట్..... తరువాత పబ్లిక్


మహిళతో కలిసి వాసల్ ఖాన్ బయట తిరగడం మొదలు పెట్టాడు. మొదట సీక్రేట్ గా వాసల్ ఖాన్ అతని ప్రియురాలితో కలిసి తిరిగాడు. రానురాను ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా ఆమెతో వాలస్ ఖాన్ తిరిగేశాడు. బయట తిరగడమే కాకుండా వాసల్ ఖాన్ అతని ప్రియురాలితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయిన వాసల్ ఖాన్ ప్రేమాయణం తరువాత వారి అసలు కథ అందరికి తెలిసిపోయింది.

ఫ్రెండ్స్ ను అడ్డం పెట్టుకుని వలలో వేసుకున్నాడని కోపం

ఫ్రెండ్స్ ను అడ్డం పెట్టుకుని వలలో వేసుకున్నాడని కోపం

మహిళ బంధువులు చాలామంది ప్రియుడు వాసల్ ఖాన్ కు పరిచయం ఉన్నారు. ఫ్రెండ్స్ ద్వారానే ఆమెను వాసల్ ఖాన్ వలలో వేసుకున్నాడని తెలిసింది. మహిళతో నువ్వు తిరగకూడదని, నువ్వు పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు వాసల్ ఖాన్ కు అనేకసార్లు వార్నింగ్ ఇచ్చారు. అయితే మహిళ ప్రియుడు వాసల్ ఖాన్ మాత్రం ఎవ్వరిని లెక్కచెయ్యలేదని తెలిసింది.

బర్త్ డే పార్టీ స్కెచ్ తో ప్రియుడిని ?

బర్త్ డే పార్టీ స్కెచ్ తో ప్రియుడిని ?

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉందని, నువ్వు కచ్చితంగా రావాలని ప్రియుడు వాసల్ ఖాన్ కు అతని ఫ్రెండ్స్ ఫోన్ చేసి పిలిచారు. రాత్రి మందు పార్టీ చేసుకుందామని వాసల్ ఖాన్ అతని ఫ్రెండ్స్ చెప్పిన ఊరిబయట ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. అంతే వాసల్ ఖాన్ కోసం వేచి చూస్తున్న అతని ఫ్రెండ్స్ లోని కొందరు వ్యక్తులు ఇనుప రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకుని అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాది పొడిచేశారు. వాసల్ ఖాన్ స్పృహ కోల్పోవడంతో అతను చచ్చాడని అతన్ని రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయారు.

మరుసటి రోజు ప్రాణం పోయింది

మరుసటి రోజు ప్రాణం పోయింది


రోడ్డు పక్కనపడిపోయిన వాసల్ ఖాన్ కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చి కేకలు వేశాడు. అటువైపు వెలుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాసల్ ఖాన్ ను బార్మార్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై వాసల్ ఖాన్ చనిపోయాడని బర్మార్ పోలీస్ స్టేషన్ అధికారి వైష్టోమ్ స్థానిక మీడియాకు చెప్పారు.

 పక్కాప్లాన్ తో ప్రియుడి హత్య

పక్కాప్లాన్ తో ప్రియుడి హత్య

మహిళ విషయంలోనే వాసల్ ఖాన్ కు బాగా పరిచయం ఉన్న కొందరు పార్టీకి ఆహ్వానించి చంపేశారని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి వైష్టోమ్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఓ మహిళ విషయంలో ఫ్రెండ్స్ చేతిలోనే వాసల్ ఖాన్ హత్యకు గురి కావడంతో బార్మార్ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+