వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady: బాగా చదివింది, ఉద్యోగం కూడా చేసింది, మెట్రో రైల్వేస్టేషన్ మీద నుంచి దూకేసింది, చివరికి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/నోయిడా: బాగా చదువుకున్న అమ్మాయి మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అమ్మాయి హ్యాపీగా ఉండేది. సెలవుల్లో సొంత ఊరికి వెళ్లి వస్తున్న యువతి ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్నది. యువతి ఉదయం మెట్రో రైల్వేస్టేషన్ కు వెళ్లింది. మెట్రో రైల్వేస్టేషన్ లోకి వెళ్లిన యువతి అధికారులు, అక్కడి సిబ్బంది కళ్లుకప్పి చాలా ఎత్తులోకి వెళ్లింది. విషయం గుర్తించిన మెట్రో అధికారులు, సిబ్బంది, పోలీసులు ఆమెను కిందకుదిగాలని మనవి చేశారు. అయితే కొంతసేపు అధికారులకు, సిబ్బందికి సినిమా చూపించిన యువతి మెట్రో రైల్వేస్టేషన్ మీద నుంచి కిందకు దూకేసింది, యువతిని రక్షించడానికి అప్పటికే అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలైన యువతిని ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై ఆమె చనిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.

Illegal affair: ఫ్రెండ్ భార్యతో సీక్రేట్ రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా చూసి స్పాట్ లో చంపేసిన భర్త, ఎస్కేప్ !Illegal affair: ఫ్రెండ్ భార్యతో సీక్రేట్ రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా చూసి స్పాట్ లో చంపేసిన భర్త, ఎస్కేప్ !

 మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశ

మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశ

పంజాబ్ లోని హోషీయార్ ప్రాంతంలో 22 ఏళ్ల రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. బాగా చదువుకున్న రష్మీ మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. చదువు పూర్తి అయిన తరువాత అనేక కంపెనీల్లో ఉద్యోగం సంపాధించాలని రష్మీ అనేక ప్రయత్నాలు చేసింది.

 ఉద్యోగంలో చేరిన యువతి

ఉద్యోగంలో చేరిన యువతి

హర్యానా చేరుకున్న రష్మీ గురగ్రామ్ లోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరిన రష్మీ హ్యాపీగా ఉండేది. సెలవుల్లో సొంత ఊరికి వెళ్లి వస్తున్న రష్మీ ఉద్యోగం చేస్తున్న కంపెనీలోని సాటి ఉద్యోగులతో కలిసి ఆమె ఉద్యోగం చేస్తున్న గురుగ్రామ్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నది.

 మెట్రో రైల్వేస్టేషన్ లో ?

మెట్రో రైల్వేస్టేషన్ లో ?

గురువారం ఢిల్లీలోని అక్షరధామ మెట్రో రైల్వేస్టేషన్ లోకి వెళ్లిన రష్మీ సైలెంట్ గానే ఉంది. అక్షరధామా మెట్రో రైల్వేస్టేషన్ లోకి వెళ్లిన రష్మీ అక్కడి అధికారులు, అక్కడి సిబ్బంది కళ్లుకప్పి మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలోని ఎత్తుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది. విషయం గుర్తించిన మెట్రో అధికారులు, సిబ్బంది, పోలీసులు రష్మీని కిందకుదిగాలని మనవి చేశారు.

ప్రాణం పోయింది

ప్రాణం పోయింది

అయితే కొంతసేపు అధికారులకు, సిబ్బందికి సినిమా చూపించిన రష్మీ మెట్రో రైల్వేస్టేషన్ మీద నుంచి కిందకు దూకేసింది, రష్మీని రక్షించడానికి అప్పటికే కింద దుప్పట్లు పట్టుకుని అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలైన రష్మీని ని ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై ఆమె చనిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. కొంతకాలం క్రితం యువతి ఉద్యోగం పోయిందని, ఉద్యోగం లేదనే ఆవేదనతో ఆమె ఉందని, కేసు విచారణలో ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Lady: Young woman commit suicide by jumping from Akshardham Metro station in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X