Lady: వేరే కాపురం పెట్టిన రోజే భార్య ఆత్మహత్య, పువ్వుల్లో పెట్టి చూసుకున్న భర్త ఏం చేశాడంటే ?
బెంగళూరు/నెలమంగల: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త అతని భార్యను మొదట్లో పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్తతో పాటు అతని తల్లి కూడా టార్చర్ పెట్టిందని తెలిసింది. వేరే కాపురం పెట్టడానికి అద్దె ఇంటికి వెళ్లిన మహిళ అదే రోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దంపతుల హ్యాపీలైఫ్
బెంగళూరు నగర శివార్లోని వీవర్స్ కాలనీలో మంజునాథ్ అలియాస్ మంజు (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ లో నివాసం ఉంటున్న పూజా (22) అనే యువతిని రెండు సంవత్సరాల క్రితం మంజునాథ్ పెళ్లి చేసుకున్నాడు.

భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకున్న భర్త
నెలమంగలలోని వీవర్స్ కాలనీలో మంజునాథ్, పూజా దంపతులు నివాసం ఉంటున్నారు. మంజునాథ్ తల్లి శ్యామలా కూడా వీళ్లతోనే కలిసి ఉంటోంది. వివాహం చేసుకున్న మంజునాథ్, పూజా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. మంజునాథ్ అతని భార్య పూజాను మొదట్లో పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు.

కడుపులో బిడ్డ, ఆరు నెలలకు మరో బిడ్డ చనిపోయారు
మొదటిసారి గర్బవతి అయిన పూజాకు అబార్షన్ అయిపోయింది. రెండోసారి బిడ్డ పుట్టిన ఆరు నెలలకే బిడ్డ చనిపోవడంతో పూజా ఆవేదన చెందింది. ఇదే విషయంలో భర్త మంజునాథ్, అతని తల్లి శ్యామాల పూజాకు టార్చర్ పెట్టారని తెలిసిందిత. పెద్దలు పంచాయితీలు చేసినా మంజునాథ్ మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది.

ఇల్లు మార్చినరోజే ఆత్మహత్య
ఇక లాభం లేదని మంజునాథ్ అతని భార్య పూజాతో కలిసి అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. అద్దె ఇంటిలో భర్త మంజునాథ్ తో కలిసి కాపురం పెట్టిన రోజే పూజా అదే ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మంజునాథ్, అత్త శ్యామలా టార్చర్ పెట్టడంతో పూజా ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.












Click it and Unblock the Notifications