Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లఖింపూర్ ఖేరి హింసాకాండ: కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్స్ ; వాస్తవాలు బయటకు రాకుండా 144సెక్షన్; కేటీఆర్, మమతా బెనర్జీ

దేశ రాజకీయాలలో ప్రస్తుతం లఖింపూర్ ఖేరి ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే లఖింపూర్ ఖేరి ఘటనను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్ ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇదో కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్ ..అనాగరిక సంఘటన . మంత్రి కేటీఆర్ ఖండన


ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్ చూసి షాక్ తిన్నానని, భయమేసిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. లఖింపూర్ ఖేరిలో రైతుల మరణంపై కేంద్రం మరియు ఉత్తర ప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యుపిలో కిల్లింగ్ రాజ్ కొనసాగుతుందని, దేశంలో "నిరంకుశత్వం" కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో బీజేపీ సర్కారుపై ధ్వజమెత్తారు.

వాస్తవాలు బయటకు రాకుండా లఖింపూర్ ఖేరిలో 144 సెక్షన్

వాస్తవాలు బయటకు రాకుండా లఖింపూర్ ఖేరిలో 144 సెక్షన్

దేశంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యం కాదు నిరంకుశత్వం అంటూ విమర్శించారు. రైతులు దారుణంగా చంపబడ్డారని, దీని వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రాకుండా బిజెపి ప్రభుత్వం అక్కడ సెక్షన్ 144 (సిఆర్‌పిసి) విధించిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బిజెపి ప్రజాప్రతినిధులకు కూడా ప్రజలు 144 సెక్షన్ విధించి ఆపుతారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన రామరాజ్యానికి బదులుగా హింసా రాజ్యం కొనసాగుతోందని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.

రైతుల పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు

రైతుల పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు

ఇదిలా ఉంటే లఖింపూర్ ఖేరి హింసాకాండలో మృతి చెందిన నలుగురు రైతుల పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన రైతులు షాక్ మరియు అధిక రక్తస్రావం వల్ల మరణించారని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. రైతుల మృతదేహాలకు ఎక్కడా బుల్లెట్ గాయాలు కనిపించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బన్బీర్ పర్యటనను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగగా, రైతుల మీదకూ కాన్వాయ్ లోని ఒక వాహనం దూసుకుపోగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ఘటనకు బాధ్యులను అరెస్ట్ చెయ్యాలని రైతు సంఘాల డిమాండ్

ఘటనకు బాధ్యులను అరెస్ట్ చెయ్యాలని రైతు సంఘాల డిమాండ్

రైతుల మీదుగా కాన్వాయ్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందగా, అనంతరం చోటుచేసుకున్న హింసలో మరో ఐదుగురు మరణించారు. ఇక ఈ ఘటనలో మరణించిన రైతులు నక్షత్ర సింగ్, దిల్జిత్ సింగ్, లవే ప్రీత్ సింగ్, గురవేంద్ర సింగ్ లని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చెయ్యాలని, ఘటనకు కారకుడైన మంత్రి రాజీనామా చెయ్యాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

యూపీ ప్రభుత్వంతో రైతు సంఘాల చర్చలు .. 45 లక్షల పరిహారం ఇస్తామన్న యూపీ సర్కార్

యూపీ ప్రభుత్వంతో రైతు సంఘాల చర్చలు .. 45 లక్షల పరిహారం ఇస్తామన్న యూపీ సర్కార్

లఖింపూర్ ఖేరిలో హింస, రైతుల మృతి ఘటనపై యుపి ప్రభుత్వం మరియు రైతు సంఘాలు 5 రౌండ్ల చర్చల తర్వాత యుపి పోలీసులు ఈ ఘటన ఎఫ్ఐఆర్‌లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి పేరును చేర్చారు. దోషులందరిపై చర్యలు తీసుకుంటామని రైతు సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనలో మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. మరణించిన రైతుల కుటుంబాలకు రూ .45 లక్షల పరిహారం చెల్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గాయపడిన వారికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. లఖింపూర్ ఖేరీ హింస ఘటనలో బాధిత కుటుంబాలలో ఒక్కో కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+