సవదితో సవతిపోరుతో పాటు దరిద్రం, పీడ పోయింది, ఏంపీకేశాడు చెప్పండి, జారకిహోళి !
బెంగళూరు/బెళగావి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిని పిలిచి మరీ ఉప ముఖ్యమంత్రిని చేశారు. తరువాత ఎమ్మెల్సీని చేసి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని కాపాడారు. బీజేపీ ఇంత చేసినా మిమ్మల్ని గాలికి వదిసి వెళ్లిపోయిన లక్ష్మణ సవది గురించి మీరు ఎందుకు ఆలోచించాలి, సవది వెళ్లిపోవడం వలన ఈ నియోజక వర్గానికి పట్టిన పీడ విరగడ అయ్యిందని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి అన్నారు.
బెళగావి జిల్లాలోని అథణి నియోజక వర్గంలో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహెళి మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రిని చేసిన బీజేపీకి లక్ష్మణ సవది ద్రోహం చేశారని, సుమారు 18 నెలల పాటు ఆ పదవిలో ఉన్న ఆయన అథణి నియోజక వర్గంలోని ప్రజలకు ఏమి మేలు చేశారు ?, ఏం పీకేశారు అని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ప్రశ్నించారు.

పదవులు అన్ని అనుభవించిన లక్ష్మణ సవది తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడి ప్రజలను మోసం చేశారని రమేష్ జారకిహోళి ఆరోపించారు. డీకే. శివకుమార్ తనకు ప్రత్యేక విమానం పంపించారని లక్ష్మణ సవది మురిసిపోతున్నారని. డీకే. శికుమార్ క్రిమినల్ మైండ్ వెనుక చాలా పెద్ద గేమ్ ఉంటుందని, దానిని అర్థం చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుందని రమేష్ జారకిహోళి ఆరోపించారు.
ఇంతకాలం లక్ష్మణ సవది అథణిలో ఉన్నాడని ఈ నియోజక వర్గానికి తాను దూరంగా ఉన్నానని, ఇప్నుడు అతని పీడపోవడంతో తాను అథణికి వచ్చానని, ఇక్కడి ప్రజలు మహేష్ కుమఠహళ్లికి ఓట్లు వెళ్లి గెలిపించాలని రమేష్ జారకిహోళి మనవి చేశారు. రమేష్ జారకిహోళి అండదండలు, ఆయన ఆర్థిక సహాయంతో, ఇక్కడి ఓటర్ల ఆదరణతో తాను లక్ష్మణ సవది మీద భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని మహేష్ కుమఠిహళ్లి ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications