జయలలిత తల్లి, మాజీ సీఎం సోదరుడు, నటుడితో రోమాన్స్, బాంబు పేల్చిన లలిత !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు/చెన్నై: భారత సినీ రంగంలో, తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పి తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయలలిత ప్రాణాలతో ఉన్న సమయంలో ఆమె గురించి మాట్లాడటానికి భయపడిన వారు ఇప్పుడు ఆమె కుటుంబం గురించి రోజుకోక మాటమాట్లాడుతూ బాంబులు పేల్చుతున్నారు. ఇంతకాలం బయటకు రాని అనేక రహస్యాలు వెల్లడిస్తున్నారు.

 జయలలిత తల్లి సంధ్య !

జయలలిత తల్లి సంధ్య !

జయలలిత తల్లి సంధ్యకు అక్రమ సంబంధం ఉండేదని ఆమె బంధువు ఎస్. లలిత బాంబు పేల్చారు. ఈ విషయంపై ఎస్. లలిత ఇచ్చిన ఇంటర్వూను బుధవారం తమిళ టీవీ చానల్ ప్రసారం చెయ్యడంతో జయలలిత అభిమానులు హడలిపోయారు.

మైసూరు రాజులు !

మైసూరు రాజులు !

జయలలిత తల్లిందడ్రులు సంధ్య, జయరామ్ కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన వారు. జయలలిత తల్లి జయరామ్ కు మైసూరు రాజవంశస్తులతో మంచి సత్ససంబంధాలు ఉండేవి. అప్పట్లో జయలలిత తల్లి సంధ్య మైసూరు ప్యాలెస్ లో అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చారని సమాచారం.

మాజీ సీఎం సోదరుడు

మాజీ సీఎం సోదరుడు

మైసూరు రాజవంశస్తులైన అరసు కుటుంబానికి చెందిన దేవరాజ్ అరసు రెండు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అరసుకు ఓ సోదరుడు ఉన్నారు. మాజీ సీఎం దేవరాజ్ అరసు సోదరుడు కెంపరాజ్ అరసు కన్నడ సినీ నటుడు, దర్శకుడు.

 జయలలిత తల్లితో ?

జయలలిత తల్లితో ?

జయలలిత చిన్నతనంలో ఆమె తల్లి సంధ్య, కన్నడ సినీ రంగంలో ప్రముఖ నటుడిగా, దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న కెంపరాజ్ అరసుకు పరిచయం అయ్యారని, ఆ సందర్బంలో ఇద్దరూ శారీరకంగా దగ్గర అయ్యారని ఆమె సమీప బంధువు ఎస్. లలిత బాంబుపేల్చారు.

 కొన్ని సంవత్సరాలు !

కొన్ని సంవత్సరాలు !

జయలలిత తల్లి సంధ్య, కన్నడ నటుడు, దర్శకుడు కెంపరాజ్ అరసుల మధ్య కొన్ని సంవత్సరాల కాలం వివాహేతర సంబంధం ఉందని, ఆ విషయం జయ తండ్రి జయరామ్ కు తెలిసి తాగుడుకు బానిస అయ్యాడని వారి సమీప బంధువు ఎస్. లలిత ఆరోపించారు.

 అందుకే దూరం అయ్యాం !

అందుకే దూరం అయ్యాం !

జయలలిత తల్లి సంధ్య, కన్నడ నటుడు, దర్శకుడు కెంపరాజ్ అరసుల విషయం తెలుసుకున్న మా బంధువులు సంధ్యకు నచ్చచెప్పారని, అయినా ఆమె మాట వినకపోవడంతో మా కుటుంబ సభ్యులు వారిని దూరం పెట్టారని ఓ తమిళ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఎస్. లలిత బాంబు పేల్చారు.

 ఎవ్వరూ ప్రాణాలతో లేరు

ఎవ్వరూ ప్రాణాలతో లేరు

జయలలిత మరణించిన తరువాత ఆమె కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అయితే జయలలితతో పాటు ఆమె తల్లి సంధ్య, తండ్రి జయరామ్, అమృత తల్లిదండ్రులు శైలజ, సారధి, కన్నడ నటుడు, దర్శకుడు కెంపరాజ్ అరసు తదితరులు ఎవ్వరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు.

 అమ్మ లేదనే ధైర్యంతో !

అమ్మ లేదనే ధైర్యంతో !

జయలలిత ప్రాణాలతో ఉన్న సమయంలో ఆమె గురించి, ఆమె వ్యక్తిగతం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటానికి సాహసం చెయ్యడానికే భయపడిన వారందరూ ఇప్పుడు ఆమె లేరని ఒకేఒక్క ధైర్యంతో మాట్లాడుతున్నారు. అయితే వీటిలో ఏదీ సత్యమో, ఏదీ అసత్యమో ఆదేవుడికే తెలియాలని అమ్మ అభిమానులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Late Tamil Nadu CM Jayalalithaa's cousin S Lalitha said that Jayalalithaa mother Sandhya and Kannada Director kemparaj Urs were "Going Steady" for many years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి