సుప్రీం ఎఫెక్ట్: లాలూప్రసాద్, జగన్నాథ్‌లపై అనర్హత వేటు

సుప్రీం తీర్పుతో అనర్హత వేటుకు గురైన మొదటి లోకసభ సభ్యుడు లాలూ. పార్లమెంటులో రెండో సభ్యుడు. సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రషీద్ మసూద్ పైన వేటు పడింది.
కాగా, దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ రెండున ఐదేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూకు కోర్టు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. అయితే నేరస్తులు చట్టసభల్లో అనర్హులని సుప్రీం జూలై 10న చెప్పింది. దీంతో లాలూ, శర్మల పైన వేటు పడింది.












Click it and Unblock the Notifications