వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో ఢీ: 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై లాలూ, నితీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు ఇరవై ఏళ్ల అనంతరం ప్రత్యర్థులైన మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లు ఏకమయ్యారు. కమలం పార్టీని ఎదుర్కొనేందుకు వీరిద్దరు కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.

జేడీ(యు) ముఖ్య నేత, మాజీ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షులు లాలులు కలిసి సోమవారం బీహార్‌లోని హాజీపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఒకే వేదిక పైన కనిపించారు. మోడీ విధానాలను వారు వ్యతిరేకించారు.

మంచి రోజులు ముందు ఉన్నాయని చెబుతూ బీజేపీ సీట్లు గెలుచుకుందని, ప్రజలు ఆ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని, మంచి రోజులు ప్రజలకు రాలేదని, కొంతమంది బీజేపీ వారికి మాత్రమే వచ్చాయని నితీష్ విమర్శలు గుప్పించారు.

నితీష్, లాలు

నితీష్, లాలు

బీహార్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇరవయ్యేళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లు ఒక్కటయ్యారు.

నితీష్, లాలు

నితీష్, లాలు


నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు కలిసి హాజీపూర్, మొహదీ నగర్ తదితర ప్రాంతాలలో ఉప ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించారు.

నితీష్, లాలు

నితీష్, లాలు

ఆగస్టు 21వ తేదీన బీహార్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆర్జేడీ, జేడీయు, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

నితీష్, లాలు

నితీష్, లాలు

ఆగస్టు 21వ జరగనున్న ఉప ఎన్నికల్లో ఆర్జేడీ నాలుగు, జేడీయు పార్టీలు చెరో నాలుగు సీట్లలో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ మిగిలిన రెండు స్థానాలలో పోటీ చేస్తోంది.

నితీష్, లాలు

నితీష్, లాలు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

నితీష్, లాలు

నితీష్, లాలు

బీహార్ రాష్ట్రంలో 40 లోకసభ స్థానాలు ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ 31 స్థానాలలో గెలిచి నితీష్ కుమార్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.

నితీష్, లాలు

నితీష్, లాలు

ఈ దెబ్బతో జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెసు పార్టీలు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, జూలై 30న ఈ మూడు పార్టీలు అలయెన్స్ ప్రకటించాయి. ఆ రోజున నితీష్, లాలులు గైర్హాజరయ్యారు.

English summary

 After being separate for 20 years, Lalu Prasad and Nitish Kumar have learnt a lesson the hard way in the assembly elections this year that it is best to stand unitedly, especially when the opposition is as strong as BJP. They are to begin campaigning together for the by-polls together. They will be conducting public rallies in Hajipur and Mohadi Nagar where they will continue to campaign next week also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X