తుపాకులతో బెదిరించి లాలూ అల్లుడి కారు చోరీ
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడి ఫార్చూనర్ కారు పట్టపగలే చోరీకి గురైంది. తుపాకులతో వచ్చిన ఐదుగురు దుండుగులు కారు డ్రైవర్‌ను బెదిరించి, అతడి చేతిలోని తాళాలు తీసుకొని కారుని ఎత్తకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటన బుధవారం గుర్గావ్ సమీపంలోని సికిందర్ పూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, వ్యక్తిగత పని నిమిత్తం లాలూ ప్రసాద్ యాదవ్ ఐదో అల్లుడు వినీత్ యాదవ్ బుధవారం గుర్గావ్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని సికిందర్ పూర్‌కు చేరుకున్నారు.

పని నిమిత్తం వినీత్ యాదవ్ కారు దిగగా, కారుని డ్రైవర్ హరి ప్రకాశ్ సికిందర్ పూర్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలంలో పార్క్ చేశాడు. ఈ సమయంలో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి కారుడ్రైవర్ హరి ప్రకాశ్‌ను బెదిరించి, తుపాకులు ఎక్కుపెట్టి డ్రైవర్ నుంచి తాళాలు లాక్కుని ఎత్తుకెళ్లిపోయారు.
మధ్యాహ్నాం పట్టపగలు కావడం తోపాటు అందరూ చూస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న గుర్గావ్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ హవా సింగ్ మాట్లాడుతూ లాలూ అల్లుడు వినీత్ యాదవ్ కారులో లేని సమయంలో ఈ సంఘటన జరిగందన్నారు. కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications