ఆ కుర్చీ సీఎం నితీష్ కోసం, మీ కోసం కాదు: లాలూ ప్రసాద్‌తో అధికారులు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోసం ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం నితీష్ కుమార్ సీటు ఖాళీ చేయవలసి వచ్చింది. ఆదివారం పట్నాలో జరిగిన ఓ సభలో నితీశ్, లాలూ ప్రసాద్‌లు పాల్గొన్నారు.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోసం ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం నితీష్ కుమార్ సీటు ఖాళీ చేయవలసి వచ్చింది. ఆదివారం పట్నాలో జరిగిన ఓ సభలో నితీశ్, లాలూ ప్రసాద్‌లు పాల్గొన్నారు.
ముందుగా సభకు వచ్చిన లాలూ వేదిక మీద ఉన్న ఓ కుర్చీలో కూర్చో బోయారు. ఇంతలో అక్కడకు వచ్చిన అధికారులు.. అది ముఖ్యమంత్రికి కేటాయించిన కుర్చీ అని, మీరు మరో కుర్చీలో కూర్చోవాలని లాలూకు సూచించారు.

లాలూప్రసాద్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పక్కనున్న విఐపీల వరసలో మరో కుర్చీలో కూర్చున్నారు. కాసేపటికి నితీశ్ వచ్చి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. కుర్చీ విషయంలో ఏం గొడవ జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూసిన శ్రేణులు లాలూ సంయమనం చూసి ఆశ్చర్యపోయారు.
కొద్ది రోజుల క్రితం ఓసారి ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ వచ్చినప్పుడు వేదిక మీద తనకు సీటు కేటాయించకపోవడంపట్ల లాలూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అందులో ఆయనను అవమానించాలన్న ఉద్దేశం ఏమీలేదని స్పష్టం చేశాక లాలూ సర్దుకుపోయారు.












Click it and Unblock the Notifications