నీతి, అవినీతి: ఇద్దరూ హగ్ చేసుకోవడం నచ్చలేదు
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ వేదిక మీద హగ్ చేసుకోవడం మాకు నచ్చలేదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
అవినీతిని నీతి అలింగనం చేసుకున్నట్లు ఉందని ఎద్దేవ చేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఐదవ సారి ప్రమాణస్వీకారం చెయ్యడం నెటిజన్లు ఇష్టపడ్డారు. అదే సమయంలో అదే వేదిక మీద లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్ అలింగనం చేసుకోవడం దారుణం అంటున్నారు.
దాణా కుంబకోణం కేసులో రూ. కోట్లు వెనక్కి వేసుకున్నారని లాలూ ప్రసాద్ మీద కేసులు నమోదు అయ్యాయని, కొన్నేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 25 లక్షలు అపరాద రుసుం చెల్లించాలని రెండు సంవత్సరాల క్రితం కేజ్రీవాల్ ట్విట్ చేశారని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.

అవినీతిని కూకటివేళ్లతో సహా నిర్మూలిస్తామని శపథం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి తాను మీకు అండగా ఉంటాలే అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ను అలింగనం చేసుకున్నట్లు ఉందని ఎద్దేవ చేస్తున్నారు.
అయినా భారతదేశంలో అవినీతి అనేది పెద్ద సమస్య కాదులే అన్నట్లు ఉందని వీరిద్దరిని చూస్తుంటే అంటూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. ఏది ఎమైనా భారత రాజకీయాలే అంతలే అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications