జైలులో లాలూకు రాజభోగాలు, రాజకీయాలపై చర్చలు

Posted By:
Subscribe to Oneindia Telugu

రాంచీ: ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ‌కు జైలులో సకల సౌకర్యాలు అందుతున్నాయని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. నిబంధనలకు విరుద్దంగా లాలూకు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.

రాంచీలోని హోత్వార్ జైలులో లాలూ శిక్షను అనుభవిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఈ జైలులో కూడా లాలూ తన హవాను కొనసాగిస్తున్నారని స్థానిక మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.

Lalu’s kingship intact in jail, spends leisure time with debates over snacks

ఈ జైలులోని అప్పర్ డివిజన్ సెల్‌లో లాలూ ఉన్నారు. కోరుకున్న ప్రతిసారీ టీ తాగుతున్నారు. ఇదే జైలులో ఉంటున్న ఇతర రాజకీయ నాయకులతో చర్చలు జరుపుతున్నారని మీడియా కథనాలను ప్రచురించింది. ఉదయం లేచిన వెంటనే పత్రికలను చదివి, వార్తలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్ రాజకీయాలపై చర్చిస్తున్నారని మీడియా తెలిపింది. లాలూతో చర్చిస్తున్నవారిలో మాజీ ఎంపీ ఆర్ కే రాణా, జగదీశ్ శర్మ, సావ్నా లక్రా, రాజా పీటర్, కమల్ కిశోర్ భగత్ ఉన్నారని మీడియా తెలిపింది.

లాలూ ఉంటున్న సెల్‌కు పక్కనే మెస్ ఉండటంతో కోరిన ప్రతిసారీ స్నాక్స్ తింటూ, టీ తాగుతున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తన సెల్‌లోనే మిగతా రాజకీయ నాయకులతో కలిసి టీవీ చూస్తున్నారని మీడియా ప్రకటించింది.లాలూకు చాలా ఇష్టమైన స్వీట్ కార్న్, బఠాణీలు, బచ్చలికూర, వంకాయలు, మిరపకాయలు వంటివాటిని మెనూలో ఉంచారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
RJD chief Lalu Prasad Yadav, who has been sent to Hotwar jail in Ranchi, does not seem to be serving as a prisoner. If reports are to be believed, the former Bihar chief minister’s kingship is intact despite the prisoner tag on him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి