10 మంది ఉగ్రవాదులను చంపిన కమాండర్ మృతి
శ్రీనగర్: ఉగ్రవాదులను అంతం చేసే సమయంలో భారత్ ఆర్మీకి చెందిన కమాండర్ లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గో స్వామి తన ప్రాణాలు వదిలాడు. 11 రోజుల్లో పది మంది ఉగ్రవాదులను అంతం చేసి పై అధికారుల దగ్గర గౌరవం పెంచుకున్నాడు.
అయితే మరింత మంది ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ప్రయత్నించిన గో స్వామి చివరికి తన ప్రాణాలు కోల్పోయాడు. 2002లో గో స్వామి ఆర్మీలో పెరా కమాండోల విభాగంలో చేరాడు. తరువాత పదోన్నతిపై ఆర్మీ ప్రత్యేక దళాల కమాండోల విభాగంలోకి మారాడు.

గత 11 రోజుల నుండి జమ్మూ - కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు ఏర్పాటు చేసిన అపరేషన్ లో గో స్వామి చురుగ్గా పాల్గోన్నాడు. ఒక్కడే 10 మంది ఉగ్రవాదులను అంతం చేశాడు. గురువారం ఈ టీం శ్రీనగర్ సమీపంలోని హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహించారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టే సందర్బంలో ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పులలో గో స్వామి ప్రాణాలు వదిలాడని ఆర్మీ సీనియర్ అధికారులు తెలిపారు. భారత ఆర్మీ అధికారులు గో స్వామికి ఘనంగా నివాళులు అర్పించారు. గో స్వామి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications