ఆ పేదింట్లో బయటపడ్డ 435 బంగారు నాణేలు: ఆమె ఏం చేసిందంటే..?

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆ పేద మహిళ నిజాయితీకి మారుపేరుగా నిలిచింది. తమ ఇంటి పునాదుల్లో దొరికిన 435 బంగారు నాణెలు తమ వద్దే ఉంచుకోకుండా ప్రభుత్వానికే చెందాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఆ మొత్తం బంగారు నాణెలను స్థానిక పోలీసులకు అప్పగించి, ప్రభుత్వానికి చెందాలని సూచించింది. దీంతో ఆమె నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని 100 కిలోమీటర్ల దూరంలోని బాణ సముద్ర అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే 55ఏళ్ల మహిళ ఉంటోంది. కాగా, ఆమె తనకు ఓ ఇంటిని నిర్మించుకునేందుకు శంకుస్థాపన కోసం గుంట తవ్వడం ప్రారంభించింది. కొంతమంది కూలీలను పెట్టుకుని ఆ పనిలో నిమగ్నమై ఉండగా, కొన్ని బంగారు నాణెలు బయటపడ్డాయి. అవన్నీబురదతో ఉన్నాయి.

Land owner finds 435 gold coins, hands over to cops

కాగా, ఇంకొంచెం లోతుగా తవ్వగా ఏకంగా 400లకుపైగా నాణేలు బయటకొచ్చాయి. వీటిని అనంతరం శుభ్రం చేయగా అవి బంగారు నాణేలు అని తేలింది. విషయం తెలిసిన కొందరు గ్రామస్తులు ఆ నాణేలను తనవద్దే ఉంచుకోవాలని సూచించారు. కానీ, ఆమె మాత్రం వారి మాట వినలేదు.

నేరుగా వెళ్లి ఆ 435 బంగారు నాణేలను పోలీసులకు అందజేసింది. ఎమ్మార్వో ద్వారా ప్రభుత్వానికి అప్పగించగా వాటిని పురావస్తు శాస్త్రవేత్తలకు పరిశీలన కోసం అప్పగించారు. బంగారు నాణేలు అని తెలిసినా.. ప్రభుత్వానికి అప్పగించిన లక్షమ్మను పోలీసులు, అధికారులు కొనియాడారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
History is filled with stories where the greed for gold has culminated in bad-mouthing, back-stabbing and beastly behaviour. But what happened in Banasamudra village is an illuminating example of honesty: Instead of secretly splitting the hidden treasure of 435 gold coins among themselves, the poor residents chose to hand it over to the government.
Please Wait while comments are loading...